క్రెడిట్ కార్డు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. క్రెడిట్ కార్డు ఇచ్చే బ్యాంకు లను తక్కువ అంచనా వేస్తే దూల తీరిపొద్ది. మనకు ఇచ్చిన అప్పుని వాళ్ళు ఏ విధంగా అయినా సరే వసూలు చేస్తారు. ఆ వసూలు చేసే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది. అసలు క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిదా లేదా అనేది ఒకసారి చూద్దాం.
Also Read:చెన్నయ్ సూపర్ కింగ్స్ మరో రికార్డ్
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు దాన్ని అప్పు ఇచ్చే టూల్ మాదిరి వాడితే మాత్రం సమస్యలు వస్తాయి. గ్రేస్ పీరియడ్ తర్వాత పేమెంట్ చేస్తే చాలా ఎక్కువ వడ్డీ కట్టాలి. దాదాపుగా 24% వరకు కట్టాల్సి ఉంటుంది. ఇక డబ్బులు విత్ డ్రా చేయడం అనేది అతిపెద్ద తప్పు. ఇంటరెస్ట్ రేట్ 24% నుంచి 42% వరకు పడుతుంది. అదే క్రెడిట్ కార్డును అవసరానికి మాత్రమే వాడి గౌరవిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి.
క్రెడిట్ హిస్టరీ అనేది కచ్చితంగా రికార్డు అవుతుంది. బిల్ పేమెంట్స్ ఫుల్ గా, టైంకి కడితే సిబిల్ స్కోర్ బాగుంటుంది. హోం లోన్ వంటివి చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఫ్రాడ్ జరిగితే బ్యాంకు నుంచి మీకు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక రివార్డ్ పాయింట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఫ్లైట్స్/హోటల్స్ కి వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సిస్ ఉచితం గా కూడా ఉంటుంది. ఫ్లైట్ కి టైం ఉంటే భోజనం చేసి, రెస్ట్ తీసుకునే సదుపాయం కూడా ఇస్తారు.
Also Read:ఉత్కంఠ పోరులో చెన్నయ్ విజయం