కోమా” మనిషి జీవితంలో ఎలాంటి స్థితిలో అయినా సరే ఈ పరిస్థితి రావొద్దని బలంగా కోరుకుంటాడు. కోమాలో ఉన్న వాళ్ళ కంటే కూడా వారి కుటుంబ సభ్యులు చేసే సేవలు మాత్రం అత్యంత దారుణం. ఇక కోమాలో ఉన్న వాళ్లకు ఆహారం సంగతి ఏంటీ అనే ఆలోచన చాలా మందిలో ఉంది. కోమా అనేది అంతర్గత అవసరాలైన ఆకలి గాని బాహ్య చర్యలైన నొప్పి లేదా స్పర్శలకు గాని స్పంధించలేకపోవడం.
Also Read:పీకల్లోతు నీటిలో స్కూల్ బస్.. 30 మంది చిన్నారులు!
అందుకే ఆకలి వేసినప్పుడు గాని మలం గాని, మూత్రంగాని వస్తున్నప్పుడు ఇతరులకు చెప్పలేరు. వీరి అవసరాలను గుర్తించి సమయానికి తగినట్టు ఆహారం అందించి ఇతర సేవలు చేయాలి. ఆహారాన్ని ముక్కు నుంచి ఒక గొట్టాన్ని కడుపులో పంపించి అందులో నుంచి మెత్తటి ఆహారాన్ని పంపిస్తారు. ఆహారాన్ని నమిలి మింగలేరు కాబట్టి అలా చేస్తారు. అయితే ఆహారం జీర్ణం అవుతుంది.
మూత్రాశయం కొంత నిండిన తర్వాత దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. కండోమ్ కథీటర్ అనేది అమర్చి దాని ద్వారా మూత్రాన్ని ఒక సంచి లోకి సేకరించడం జరుగుతుంది. అలాగే మలం విషయంలో కూడా జరుగుతుంది. చిన్న పిల్లలకు ఎలా అయితే అడల్ట్ డైపర్స్ అమరుస్తారో… వారికి కూడా తొడుగుతారు. వీరికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి గుడ్డతో శుభ్రం చేస్తారు. ఎప్పుడూ మంచం మీదనే ఉంటారు కాబట్టి… ఒత్తిడితో పుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతీ 15 నిమిషాలకు దొర్లిస్తూ ఉంటారు. వీరికి సేవ చేసే నర్సులు ఒకరకంగా వారికి తల్లికి మించి అన్నట్టే.
Also Read:పలు రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ … అమర్ నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్…!