ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్… ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా అన్నట్టు ఉండేది. ఎంత మంది హీరోలు ఉన్నా సరే ఆయన సినిమా అంటే ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే మరి. ఇక ఎన్టీఆర్ సినిమాల్లో నటించే నటులకు కూడా చాలా మంచి ఇమేజ్ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం తన సినిమాల్లో నటించే వారికి కొన్ని కొన్ని షరతులు కూడా విధించే వారు.
ALso Read:సింగరేణి ని చంపే ప్రయత్నం చేస్తున్నారు..!
ప్రధానంగా సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో నటించే వారి విషయంలో కండీషన్ లు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ కు కృష్ణ కు మధ్య విభేదాలు ఎక్కువగా ఉండేవి అనే ప్రచారం బాగా జరిగింది. అది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా ఆ ప్రచారం మాత్రం తెలుగు సినిమాలో ఒక సంచలనం.
ఎన్టీఆర్ నటించిన దానవీర శూరకర్ణ, కృష్ణ నటించిన కురుక్షేత్రం సినిమాలను దాదాపు ఒకే కథాంశంతో తెరకెక్కించారు. కాని నటులు కూడా రెండు వర్గాలుగా విడిపోయినా కైకాల సత్యనారాయణ మాత్రం రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. అల్లూరి సీతారామ రాజు సినిమా విషయంలో కూడా గొడవ జరిగింది. ఆ సినిమాను ఎన్టీఆర్ తీస్తాను అని చెప్పినా కృష్ణ చేసి షాక్ ఇచ్చారు. దీనితో ఎన్టీఆర్ కు, కృష్ణ కు మధ్య పదేళ్ల పాటు దూరం కొనసాగింది.
అయితే దానవీర శూరకర్ణ మాత్రం విజయం సాధిస్తే కురుక్షేత్రం ఫ్లాప్ అయింది. కాని ఎన్టీఆర్ సినిమాకు మంచి పోటీ ఇచ్చారు. అయితే ఈ రెండు సినిమాల్లో నటించిన కైకాలను పిలిచి… ఆ సినిమాలో నటించవద్దు అని ఎన్టీఆర్ చెప్పినా సరే ముందు బుక్ చేసుకున్నాను అని చెప్పడంతో ఎన్టీఆర్ సైలెంట్ అయ్యారట.
Also Read:కుప్పకూలిన సెన్సెక్స్..!