రెండో పెళ్లి వార్తలపై ఇదివరకే క్లారిటీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హారోయిన్ మీనా..తాజాగా వస్తోన్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి ప్రచారం లేదని కుండబద్ధలు కొట్టినట్టు స్ఫష్టం చేశారు. మీనా రెండో పెళ్లి వార్తలపై దుమారం రేగిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.
వదంతిలో వాస్తవమెంతో తెలియదుగాని..సీనియర్ నటి మీనా ఓ యంగ్ తమిళ హీరోను పెళ్లి చేసుకోనుందని, వారిద్దరి నిశ్చితార్థానికి ఆల్రెడీ ముహూర్తం కూడా జరిగిందని జోరుగా ప్రచారం సాగుతోంది.
నటి మీనా భర్త గతేడాది జూన్ 28న భర్త విద్యాసాగర్ ను కోల్పోయారు. ఆ బాధ నుంచి తేరుకునే ప్రయత్నంలో భాగంగానే పలు చిత్రాల్లో నటిస్తూ కాలం గడుపుతున్నారామె. కుటుంబసభ్యులు రెండో వివాహం చేసుకోవాలని సూచించినా.. వాళ్ల ప్రతిపాదనను పక్కన పెడుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే అప్పట్లో మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వార్తలపై స్పందించిన ఆమె.. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పుడు మరోసారి మీనా మరో పెళ్లిపై అదే తరహా ప్రచారం జరుగుతోంది. కారణం ఓ తమిళ యూట్యూబ్ వీడియో. ఆమె త్వరలో ఓ తమిళ హీరోను పెళ్లి చేసుకోబోతున్నారని, అతను గతేడాది భార్యకు విడాకులు ఇచ్చి విడిపోయారంటూ ప్రసారం అయింది.
అంతే కాదు ఆ హీరోకు 39ఏళ్లు అని, అతను మీనా కంటే చిన్నవాడని, వారిద్దరి నిశ్చితార్థం కూడా జరిగినట్టు ఆ కథనం సారాంశం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మీనా రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది.
మరికొందరేమో ఈ కామెంట్స్ చేసిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లపై తాజాగా నటి మీనా స్పందించారు. అతను చేసిన వ్యా్ఖ్యలను ఖండిస్తూ.. డబ్బు, పేరు కోసం ఏమైనా రాస్తారా.. సోషల్ మీడియా రోజు రోజుకూ దిగజారిపోతోందంటూ మండిపడ్డారు.
వాస్తవాలు తెలుసుకొని రాయండంటూ మీనా హెచ్చరించారు. తన భర్త చనిపోయినపుడు కూడా రకరకాల తప్పుడు వార్తలు ప్రచారం చేశారని, ఇంకోసారి తనపై రాంగ్ రూమర్స్ క్రియేట్ చేస్తే చర్యలు తీసుకుంటానంటూ మీనా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.