పోలీసు చట్టాలకు సంబంధించి, న్యాయ పరమైన విషయాల గురించి అందరికి ఎంతోకొంత అవగాహన అనేది అవసరం. అవగాహన ఉంటే ఏదైనా అనుకోని సమస్య వస్తే మాత్రం ఆ సమస్య నుంచి బయట పడే అవకాశాలు ఉంటాయి. పోలీసులతో మనం మాట్లాడటానికి డీల్ చేయడానికి అవగాహన అనేది చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇక మన దేశంలో చట్టాల గురించి పోలీసు వ్యవస్థ గురించి చాలా మందికి అవగాహన ఉండదు.
ఇక పోలీసు కేసులు నమోదు చేసినప్పుడు పోలీస్ కేసులో ఎఫ్‌ఐఆర్‌కి, ఛార్జిషీట్‌కి మధ్య తేడా ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. ఇండియన్ న్యాయ వ్యవస్థలో ఎఫ్ ఐ ఆర్ చార్జ్ షీట్ చాలా ప్రధానమైనవి. బాధితుడు పోలీసు స్టేషన్ కు వెళ్లి లిఖిత పూర్వకంగా గానీ… తన వాంగ్మూలం ను విన్నవించగా తయారు చేస్తారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తర్వాత ఆ కాపీని బాధితుడికి అప్పగించాల్సి ఉంటుంది.
Advertisements
ఎఫ్ ఐ ఆర్ ను పోలీసు వారు నమోదు చేసి విచారణలో ముందుకు వెళ్తారు. చార్జ్ షీట్ విషయానికి వస్తే విచారణ జరిగిన తర్వాత అంటే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తర్వాత విచారణ నివేదికను న్యాయాధికారికి సమర్పిస్తారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తే కచ్చితంగా చార్జ్ షీట్ దాఖలు కావాల్సిందే. లేదంటే మాత్రం న్యాయస్థానం ముందు విచారణ చేసిన పోలీసులు గాని, విచారణ సంస్థలు గాని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. న్యాయస్థానం ఆగ్రహానికి లోను కావాలి.