బెయిల్ గురించి పెరోల్ గురించి మనం ఏదోక సందర్భంలో వింటూనే ఉంటాం. అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది చాలా మందికి క్లారిటీ లేదు. అసలు రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటీ…? నేరం ఆరోపించినపుడు సదరు ఆరోపించబడ్డ వ్యక్తి కేవలం నిందితుడు మాత్రమే. నేరం రుజువు అయితే నేరస్తుడు. కాబట్టి అరెస్ట్ చేయటానికి వీలు లేదు. అయితే ఆరోపణ తీవ్రంగా ఉంటే… ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయవచ్చు.
Also Read:మరో టైటిల్ వేటలో భారత షట్లర్లు.. సెమీ ఫైనల్స్ చేరిన పీవీ సింధు, కిదాంబి
దీనితో చట్టపరంగా విచారణ ముందుకు వెళ్ళడానికి, న్యాయ విచారణకు ఆటంకం కలగకుండా ఉండటానికి, హియరింగ్ సమయంలో కోర్ట్ లో హాజరు పరచడానికి అరెస్ట్ చేస్తారు. అయితే అరెస్ట్ తర్వాత లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిస్తే… తాము కోర్టు పిలిచినపుడు అందుబాటులో ఉంటామనీ చెప్తూ న్యాయ విచారణకు హాజరు అవుతామని కోర్టుకు నిందితులు దరఖాస్తు చేసుకోవడమే బెయిల్ దరఖాస్తు.
దీనికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిందితుడిని వదిలితే కేసు నీరుగార్చే ప్రయత్నం చేయడం గాని సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని విచారణ అధికారులు భావించి, కోర్ట్ లో రుజువు చేస్తే మినహా బెయిల్ నిరాకరించే అవకాశం లేదు. బెయిల్ నియమ నిబంధనలకు సంబంధించి సెక్షన్ 436, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ లో వివరంగా చెప్పారు.
ఇక పెరోల్ విషయానికి వస్తే, నేరస్తుడు అంటే నేరం చేసినట్టు రుజువు అయిన వ్యక్తి… శిక్షా కాలం పూర్తి చేసుకునే క్రమంలో అతడి సత్ప్రవర్తనను బట్టి అతనికి పెరోల్ ఇస్తారు. ఉదాహరణకు జైలు శిక్ష సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలు నళిని శ్రీహరన్ తన కుమార్తె పెళ్ళికి, కుటుంబ సభ్యుల అనారోగ్యం సమయంలో పెరోల్ తీసుకుని బయటకు వచ్చారు. కొన్ని రోజుల పాటు ఆమెకు పెరోల్ ఇచ్చారు. పెరోల్ సమయంలో పోలీసులు ఆమె వెంట ఉన్నారు.
Also Read:ప్రజల నెత్తిన కేసీఆర్ అప్పుల మూట