ఎంత మంచి సినిమా అయినా సరే వీడియో క్లారిటీ లేకపోతే పిచ్చి లేస్తుంది కదా… మన దేశంలో పైరసీ సినిమా కూడా క్లారిటీగా ఉండాలి అనుకుంటారు. సరే గాని వీడియో క్లారిటీలో 1080i కి, 1080p కి తేడా ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. 1080p మరియు 1080i – వీటి రెండిట్లో కూడా… అడ్డంగా – 1920 పిక్సల్స్, నిలువుగా – 1080 పిక్సల్స్ ఉండటం కామన్.
Also Read:ఇప్పటి వరకూ టాప్ 5 థియేట్రికల్ రైట్స్ సాధించిన సినిమాలు ఇవే
మొత్తం స్క్రీన్ మీద 1920 * 1080 = 20,73,600 పిక్సల్స్ ఉంటాయన్నట్టు. 1080i లో i అంటే interlaced అని అర్ధం. తెలుగులో అల్లుకున్నవి ఉన్నవి అని అర్ధం. అడ్డంగా బేసి సంఖ్య వరుసలు అన్ని ఒకసారి బ్లింక్ అవుతాయి. అవి ఆగిన తర్వాత సరి సంఖ్యలో ఉన్నవి బ్లింక్ అవుతాయి. వెలిగి ఆగే మధ్యలో సమయం చాల తక్కువగా ఉంటుంది. ఒక్క సెకను లో 30 సార్లు వెలిగి ఆగే అంత తక్కువ.
మన కన్ను కూడా దాన్ని గుర్తించే అవకాశం లేదు. అది కేవలం ఒక బొమ్మ మాత్రమె. పాత టీవీ లు గమనిస్తే ఆ గీతలు మనకు కనపడేవి. 1080p లో p అంటే progressive అని అర్ధం. తెలుగులో… క్రమంగా ముందుకు వెళ్ళడమం. ఇందులో ప్రతి అడ్డం వరుసలో ఉన్న 1920 పిక్సెల్స్ , 1 వెలిగి ఆగిన వెంటనే 2, 2 వెలిగి ఆగిన వెంటనే 3, 3 వెలిగి ఆగిన తర్వాత 4 ఇలా 1920 వెలిగి ఆగుతాయి. ఒక సెకన్ లో ఇది జరిగిపోతుంది. సెకనుకి 60 సార్లు ఆ విధంగా జరుగుతుంది. 1080i వాడేది చాలా తక్కువ. అది సపోర్ట్ చేసేవి కూడా మనకు పెద్దగా కనపడవు. కంప్యూటర్లలోనూ 1080p మాత్రమే వాడటం జరుగుతుంది.
Also Read:హైదరాబాద్ లో చోర్ బజార్ లు ఎక్కడ…? చోర్ బజార్ అసలు పేరేంటి…?