మన నిత్య జీవితంలో ఎక్కువగా చూస్తున్నవి బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్. ఈ రెండింటితో ఇప్పుడు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అవసరం ఎక్కువగా ఉంటుంది. చెల్లింపుల కోసం మనం ఎక్కువగా వాడుతుంది క్యూఆర్ కోడ్. ఫోన్ పే లేదా గూగుల్ పే వంటి వాటి కోసం క్యూఆర్ ఎక్కువగా వాడుతున్నాం. ఇక వస్తువుల అమ్మకాలు తదితర విషయాలకు సంబంధించి మనం వాడేది ఎక్కువగా బార్ కోడ్.
Also Read:వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ.. మదుపర్లకు షాక్
బార్ కోడ్ ను మెషిన్ తో స్కాన్ చేస్తారు. ఒక లైన్ లో వస్తువుకి సంబంధించిన సమాచారం మొత్తం మనం దాచి పెట్టవచ్చు. ఇందులో కొన్ని సంఖ్యలు,అక్షరాలూ అలాగే నలుపు తెలుపు గీతాల మధ్య మారే దూరం వల్ల ఈ కోడ్ తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా నిత్యావసరాలు, లేదంటే ఎలక్ట్రానిక్ పరికరాలు బట్టలు వంటి వాటికి ఎక్కువగా వినియోగిస్తారు. ఈ కోడ్ కు సంబంధించిన స్టిక్కర్ లను స్కాన్ చేయడం మీరు గమనించే ఉంటారు.
మరొకటి క్యూఆర్ కోడ్… బ్లాక్ లతో సమాచారాన్ని మనకు అందిస్తారు. ఇది ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ద్వారా వాడతారు. బార్‌కోడ్‌లు మరియు క్యూఆర్ కోడ్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం భౌతిక కొలత. 21 x 21 మాడ్యుల్స్ తో మొదలై 177 x 177 మాడ్యుల్స్ దాకా పెరిగింది. మొదట్లో నాలుగు గుర్తుల సమాచారం ఇప్పుడు 4296 సంఖ్య వరకు పెరిగింది. మొబైల్ కెమరా ఏ కోణం నుండి స్కాన్ చేసినా అది సవ్య దిశలో చూపించే విధంగా తయారు చేస్తారు. లగేజ్ టేగులు,అడ్రెస్సులు,మొబైల్ చెల్లింపులు,హోటల్ లో వైఫై షేరింగ్ ,ఫోన్ నం .,ఈమెయిలు, ప్రత్యెక వెబ్సైట్ లు, సరుకుల వివరాలు ఇందులో కూడా ఉంటాయి.
Also Read:బాలీవుడ్ తారా.. హాలీవుడ్ లోకి..!