హోటల్ అంటే ఏంటీ…? మోటెల్ అంటే ఏంటీ…? మోటెల్ మన దగ్గర ఉందా…? చాలా మందికి వీటికి అర్ధాలు తెలియదు. అసలు హోటల్ కు మోటెల్ కు మధ్య ఉన్న తేడాలను ఒకసారి మనం చూద్దాం.

హోటల్:
హోటల్ ఎక్కువ సౌకర్యాలను వినియోగదారులకు అందిస్తుంది.
హోటల్ ఒకటి లేదా ఎక్కువ అంతస్తులుగా ఉంటుంది.
దీనికి ఎక్కువ గదులతో పాటుగా ఎక్కువ సౌకర్యాలు ఉండటమే కాకుండా రేటు ఎక్కువగా ఉంటుంది.
ఇది నగరం లేదా గ్రామంలో ఎక్కడైనా ఉండవచ్చు.
అదే విధంగా హోటల్ కు స్టార్ రేటింగ్ ఒకటి ఉంటుంది.
అన్ని దేశాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

మోటెల్:
హోటల్ తో పోలిస్తే చాలా తక్కువ సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇది ఒకటి లేదా రెండు అంతస్తులుగా మాత్రమే ఉంటుంది.
పరిమిత సంఖ్యలో గదులు ఉండటమే కాకుండా ధర కూడా చాలా తక్కువ.
ఇవి కేవలం నగరాల శివార్లలో లేదా రహదారుల సమీపంలో మాత్రమే ఉంటుంది.
ఏ విధమైన స్టార్ రేటింగ్ ఉండదు, ప్రపంచంలో ఇవి ఉండేది కేవలం అమెరికాలో మాత్రమే.
Also Read: విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విండో ఎందుకు ఓపెన్ చెయ్యాలి…?