తెలుగు సినీ పరిశ్రమలో నట సింహం బాలకృష్ణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని అందించాయి. బాలయ్య అంటే ఒక రకమైన మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన వీర సింహ రెడ్డి సినిమా కూడా బాలయ్య గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఊర మాస్ గా ఉంది.
ఇక బాలయ్య విషయం పక్కన పెడితే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీయార్ ఒకరు. ఈయన కూడా బాలయ్య రేంజ్ మాస్ హీరోగా ఎదిగాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి బాలయ్యకి, ఎన్టీయార్ కి పడటం లేదు అనే విషయం నెట్లో తెగ వైరల్ అవుతుంది అసలు వీళ్ళ మద్య ఎందుకు గొడవలు వచ్చాయి అనే విషయం లోకి వెళ్తే.
బాలయ్య ఎన్టీయార్ ని టీడీపీ పార్టీ తరుపున ప్రచారానికి రమ్మంటే తను ఏ రకం గా కూడా రెస్పాండ్ కాలేదట దాంతో బాలయ్య ఎన్టీయార్ ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేనట్లుగా తెలుస్తుంది.
అందుకే ఎన్టీయార్ కి సంబంధించిన ఏ పార్టీ లో, ఫంక్షన్ లో బాలయ్య కనిపించడం లేదని తెలుస్తుంది. ఈరోజే ఎన్టీయార్ కొరటాల సినిమా కి సంబంధించిన ముహూర్తం ఈ నెల 23 వ తేదీన జరగబోతుంది అని ఆ సినిమా టీమ్ నుంచి ఓ అప్డేట్ కూడా వదిలారు. ఈ సినిమా మీద ఎన్టీయార్ కి కానీ, ఆయన అభిమానుల్లో కానీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి…