హిందూ మతానికి సంబంధించి చరిత్రలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ప్రతీ అంశానికి సంబంధించి ఏదోక అర్ధం హిందూ మతంలో ప్రస్తావించారు. అలా ప్రస్తావించిన వాటిల్లో ఓం కూడా ఒకటి. ఏదైనా మంచి కార్యక్రమం గాని లేదా సాహసం లాంటివి చేస్తున్నా ఓం అని రాసుకుంటూ ఉంటారు లేదా మనసులో అనుకుంటారు. ఓంకారం కు సంబంధించిన వీడియోలు యోగా సమయంలో వినే వాళ్ళు ఉన్నారు.
Also Read:కర్మ కాండల సమయంలో తల నీలాలు ఎందుకు తొలగిస్తారు…?
అసలు ఓం కు ఉన్న చరిత్ర ఏంటో చూద్దాం. అందులో అర సున్నలు 4 ఉంటాయి మనం గమనిస్తే… రెండు పక్కపక్కనే ఉంటుంది. అందులో ఆ రెంటిలో ఒక అర సున్న పైన మరి ఒక అర సున్న తలక్రిందులుగాను ఉంటుంది. ఇక నాలుగవ అరా సున్న కుడి వైపు మూలకు పైన ఉండి అందులో ఒక చుక్క కనపడుతుంది. వీటికి వివరణ ఏంటి అనేది మనం గమనిస్తే…
పక్కపక్కనే ఉన్న రెండు అర సున్న లలో ఒకటి జాగృతి అవస్థను సూచిస్తుంది. అంటే అర్ధం మెలకువ కలిగి ఉండే అవస్థ అని వస్తుంది. రెండవది దాదాపుగా అలాంటిదే. పక్కన ఉండే అర సున్న నిద్రలో కల లో మనము మెలకువగా ఉంటామని… కలలో నిజమైనట్లుగా మనం స్పృహ కలిగి ఉంటాం అని అర్ధం వస్తుంది. తల క్రిందులుగా ఉన్న అర సున్న గాఢ నిద్రలో ఉంటుంది. అందులో ఏ కలలు ఉండవు. ఏమాత్రమూ స్పృహ ఉండదని అర్ధం. ఇక చివర నాలుగోవది అర సున్న అందులో చుక్క ఇది బ్రహ్మైక్యమ్ ఆత్మలో ఉండటం లేదా దేవునిలో ఉండటం అని… ఇక చివరిగా చుక్క దైవాత్మను సూచిస్తుంది.
Also Read:రేవంత్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు!