ఇండియన్ సినిమాలో కేజిఎఫ్ ఒక సంచలనం. ఈ సినిమా మొదటి పార్ట్ క్రియేట్ చేసిన ఉత్కంట ఆ సినిమాకు అన్ని భాషల్లో క్రేజ్ తీసుకొచ్చింది. ఇక యష్ తో పాటు ప్రతీ పాత్ర కూడా ఒక ఆసక్తి పెంచుతుంది. ఇక ఈ సినిమాకు అసలు ఇంత క్రేజ్ పెరగడానికి, ఇండియా బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవడానికి, కన్నడ సినిమా గతిని మార్చడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:ఆ దమ్ముందా..? రాజకీయాల నుంచి తప్పుకుంటా! రేవంత్ సవాల్
అసలు ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవ్వడానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే హిరోయిజం. మరో మాట ఎలివేషన్స్ అనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు హీరో పాత్రకు ఉండే వెయిట్, ఆ పాత్ర పడిన కష్టాలు, తల్లి ప్రేమ అన్నీ కూడా సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో సంగీతం ఇంకా నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. అమ్మ పాటకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బింగ్, డైలాగులు కథనానికి ఏమాత్రం తగ్గవు. సినిమాను ఏ భాషలో చూసినా సొంత సినిమా అనే ఫీల్ ఉంటుంది. “గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్న భయంకరంగా ఉంటుంది” అనే డైలాగు ఒకటి బాగా ఆకట్టుకుంటే… పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రం పవర్ ఫుల్ ప్లేసెస్ బాగా ఆకట్టుకుంది. ఇక మొదటి పార్ట్ లో క్లైమాక్స్ సినిమా రేంజ్ ను బాగా పెంచింది.
గరుడని చంపే సీన్ ను ఎన్ని సార్లు చూసినా ఆసక్తికరంగానే ఉంటుంది. రెండో భాగంలో అధీరా పాత్ర కూడా బాగుంటుంది. అలాగే కథ చెప్పే ఆనంద్ వాసిరాజు మాట్లాడే మాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. రెండో భాగంలో ప్రకాష్ రాజ్ పాత్ర హైలెట్ అయింది. రవీనా పోషించిన పాత్ర, రావు రమేష్ మాటలు అన్నీ ప్రేక్షకులకు నచ్చాయి.