రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ రకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు.
దానికి కారణం రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలను ఎలా చూపించబోతున్నాడు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాడు అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ట్రైలర్, టీజర్ రిలీజ్ చేసిన సమయంలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత ఉంటుందని చెప్పకనే చెప్పాడు రాజమౌళి. చెప్పినట్టుగానే సినిమాలో ఇద్దరినీ అద్భుతంగా చూపించాడు.
ఆ ఇద్దరి మధ్య ఎమోషన్ సీన్స్ కూడా చక్కగా తెరకెక్కించాడు. నిజానికి ఒక సినిమా హిట్ అవ్వాలంటే దర్శకుడు అనుకున్న సీన్స్, రాసే విధానం కూడా చాలా ముఖ్యమైనది. ఈ సినిమాకు రాజమౌళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో ఆ సీన్స్ చూస్తేనే అర్థమైపోతుంది.
యాడ్స్ లో నటించటానికి నో చెప్పిన టాలీవుడ్ హీరోస్ వీరే!!
సినిమాలో ఇద్దరు హీరోలు కలిసినప్పుడు ఒకరినొకరు పరిచయం చేసి చేతులు పట్టుకుంటారు. అప్పుడు ఇద్దరి చేతులు సమానంగా ఉండేలా చూపిస్తారు. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ లో రామరాజు చెయ్యి పైన ఉంటే భీమ్ చెయ్యి కిందకి ఉంటుంది. ఇద్దరికీ మధ్యలో ఉంటుంది తాడు ఉంటుంది. అప్పుడు రామరాజు పై చెయ్యి సాధించాడని అర్థం. అలాగే వారిద్దరి మధ్య దూరం కూడా ఉందని అర్థం.
కెరీర్ పీక్ స్టేజ్ లో చనిపోయిన నందమూరి హీరో ఎవరో తెలుసా ?
ఆ తర్వాత రామరాజు ను కాపాడటానికి వెళ్ళినప్పుడు భీమ్ రామరాజు ను పైకి లేపుతాడు. అప్పుడు భీమ్ చెయ్యి పైన ఉంటుంది. ఇలా ప్రతి సీన్ లో కూడా రామరాజు, భీమ్ ల గురించి అద్భుతంగా చూపించాడు రాజమౌళి.