వెంకటేశ్వర రావు గారు, రామారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బమ్మ గారు అంటూ చాలా గౌరవంగా లోపల నుంచి రాకపోయినా పెదవుల నుంచి అయినా పిలుస్తూ ఉంటాం.
మన తెలుగులో గారు అంటే తమిళంలో అవర్గళ్ అంటారు. అవరగళు అనేది కన్నడ పదం. ఇక హిందీ తెలిసిందే కదండీ… మోది జి, సోనియా జీ, రాజీవ్ జీ, రాహుల్ జీ ఇలా జీ అంటూ గౌరవిస్తాం.
వాస్తవానికి పురాణాలు గాని సంస్కృత కావ్యాలలో గాని ఆ పదాన్ని మనకు పరిచయం చేయలేదు. తర్వాత ఏమైనా సంస్కృతం నుంచి ఇతర భాషలకు అనువాదం చేసినప్పుడు మార్చి ఉండవచ్చు. పురాణాల్లో రాముడు, రాములవారు, సీత, సీతమ్మ వారు, కృష్ణుడు అంటారు గానీ కృష్ణుడు గారూ, సీత గారూ, రాముడు గారూ అనలేదు. వినడానికి కూడా విడ్డూరంగా ఉంటది.
మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ గారు అనే గౌరవం ఉంటుంది. ఇతర భాషల్లో పేరులోనే, పిలుపులోనే గౌరవం ఉంటుంది. గురువులను గురువర్యా, దేవతలను అమ్మవారు అంటూ పిలుస్తారు. వారు అనే పదం క్రమంగా గారుకి మారిపోయి ఉంటుంది. ఇది అండీ వ్యూవర్ గారూ… గారు చరిత్ర.
Also Read: లడఖ్ లో ఏ సిమ్ కార్డు పని చేస్తుంది…? ఏ టైం లో వెళ్తే మంచిది…?