ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ముదు రోడ్ల మీద ఉండే గుర్తుల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తెల్ల గుర్తు, పసుపు గుర్తు, యారో మార్క్ లు ఇలా ప్రతీ విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి స్పష్టమైన అవగాహన లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ఇక రోడ్ల మీద ఏయే గీతాలు ఉంటె ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒకసారి చూద్దాం.
Also Read:డ్రోన్ తో మందు గుండ్లు..చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
మధ్యలో ఖాళీలు ఉన్న తెల్ల గీత ఉంటె రోడ్డు రెండు వైపులా దాటవచ్చు. ఓవర్ టేక్ కూడా చేయవచ్చు, యూ టర్న్ కూడా తిరిగే అవకాశం ఉంటుంది.
ఒకటే తెల్లగీత ఉంటె మాత్రం రోడ్ల మీద జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ టేక్ అసలు ఏ మాత్రం చేయవద్దు. ఇలాంటి రోడ్ల మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
ఒంటరి పసుపు పచ్చ గీత ఉంటె మీరున్న వైపే నడపాల్సి ఉంటుంది. ఓవర్ టేక్ గాని యూటర్న్ గాని నిషేధం.
రెండు పసుపు గీతాలు ఉంటె ఉన్న వైపే నడపాల్సి ఉంటుంది. గీత దాటిపోయినా, యూ టర్న్ చేసినా సరే అతి తీవ్రంగా పరిగణిస్తారు.
ఖాళీలు ఉన్న ఒకటే పసుపు గీత ఉంటె… అవసరమైతే గీత ధాటి అవతలి వైపుకి వెళ్ళవచ్చు. కాకపోతే జాగాట్టగా ఉండాలి.
ఖాళీలు లేని ఒక గీత, ఖాళీలు ఉన్న ఒక గీత ఉంటె మాత్రం లేని వైపు మాత్రమె వెళ్ళాలి.
Also Read:మరో రికార్డు దిశగా కేజీఎఫ్2