వినియోగదారుల విషయంలో ఉన్న చట్టాలు ఈ మధ్య కాలంలో కాస్త పటిష్టంగానే కనపడుతున్నాయి. కష్టపడి సంపాదించి ఒక వస్తువు కొని ఆ వస్తువు విషయంలో మోసం జరిగితే వినియోగదారుడు ఏం చేయాలి అనే దానిపై చట్టం అన్ని అవకాశాలు కల్పించింది. ఇక జిల్లా కంజ్యూమర్ ఫోరమ్‌లో కేసు వేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఏంటీ అనేది ఒకసారి చూస్తే…
Also Read:‘బుల్డోజర్ బాబా’గా యూపీ సీఎం.. నేరస్థులకు చుక్కలే..!
ఏదైనా వస్తువునో, సేవనో డబ్బులు పెట్టి కొన్న వినియోగాదారుడై ఉండాలి. ఆ వస్తువు లేదా సేవ మీరు పెట్టిన డబ్బులకు తగినట్లు లేకనో, వారు మీకు హామీ ఇచ్చినట్లు లేక మీకు నష్టం కలగడం లేదంటే అసౌకర్యం గానీ కలిగి ఉంటే మీకు ఫోరం అండగా ఉంటుంది. ఆ నష్టాన్ని, లేక అసౌకర్యాన్ని పూర్తిగా స్పష్టమైన కారణంతో వివరిస్తూ ఆ వస్తువు లేదా సేవ అమ్మిన వారికి మీరు వ్రాత పూర్వకంగా తెలియజేసి మీకు ఎటువంటి పరిహారం కావాలో అడిగి ఉండాలి.
ఏదైనా సందర్భంలో వాళ్ళు మీ ఫిర్యాదుకు స్పందించక పోవడమో జరిగినా లేక వారు సూచించిన లేదా చేసిన పరిష్కారం మీకు సంతృప్తికరంగా లేకపోవడమో జరిగి ఉంటే మీరు ఫోరం కు వెళ్ళవచ్చు. పైన చెప్పినవి అన్నీ మీ వద్ద నిజాయితీగా ఉంటే మీకు జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేయడానికి అర్హత లభించినట్లే అని చెప్పాలి. కేసు వాదించడానికి ఒక లాయర్ అవసరం ఉండవచ్చు.
Also Read:భీర్భూమ్ ఘటనలో కీలక విషయాలు.. పలువురు నేతల అరెస్ట్ కు సీఎం ఆదేశాలు