ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒకరి సినిమా ప్రమోషన్స్ కు మరొకరు వస్తూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు… గతంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా కి వాయిస్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సినిమా మొత్తం మహేష్ వాయిస్ తోనే నడుస్తూ ఉంటుంది. అలాగే శ్రీను వైట్ల ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన బాద్ షా సినిమాకి కూడా మహేష్ బాబు వాయిస్ అందించాడు. ఆ తర్వాత కృష్ణ నటించిన శ్రీ శ్రీ సినిమాకు, అక్క మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్ బాబు.
కే జి ఎఫ్ హీరో యష్ ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ? సీరియల్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి నేడు!
ఇక ఇప్పుడు ఆచార్య సినిమాకి కూడా మహేష్ వాయిస్ ఇవ్వబోతున్నాడట. నిజానికి చిరంజీవి చరణ్ ల తో మహేష్ కు మంచి అనుబంధం ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మెగాస్టార్ చిరంజీవి వచ్చి టీం కి విషెస్ తెలిపారు.
ఇకపోతే ఆచార్య సినిమాలో చరణ్ నటించిన సిద్ద పాత్ర చేయాల్సింది గా మహేష్ ను మొదట కోరాడు కొరటాల శివ. కానీ మహేష్ అందుకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చిరు పై తనకున్న అభిమానాన్ని చాటుకోబోతున్నాడట మహేష్.