ఎన్టీఆర్” ఈ పేరు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల, సినీ రాజకీయ వ్యవహారాల్లో మార్మోగుతూనే ఉంటుంది. రాజకీయంగా ఏ ప్రస్తావన వచ్చినా… అది పరిపాలన అయినా, ఎన్నికల ప్రచారం అయినా సరే ఎన్టీఆర్ కీలకం అవుతూ ఉంటారు. ఇటీవల కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం కూడా సంచలనం అయింది. అసలు ఎన్టీఆర్ పేరు ప్రజల్లోకి అంత బలంగా వెళ్ళడానికి కారణం ఏంటీ…?
Also Read:టెట్ ఫలితాలకు ముహుర్తం ఖరారు..
కృష్ణా జిల్లాలో అన్ని కాలేజీలు ఉన్నా సరే ఆయన గుంటూరులో బీఏ చదవడం అక్కడి ప్రజలు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగినా సరే ఆయన సామాన్యుడిగానే ఉండటం ఆయన ప్రత్యేకత. ఏసీ గదులు కారులూ అలవాటైనా సరే చైతన్యరధ యాత్రలు, మురికినీళ్ళ అంగోస్త్ర స్నానాలు చేయడం రాజకీయాల్లో ఒక సంచలనం. ఇక పరిపాలన పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక సంచలనం.
పటేళ్ళు, మునసబు కరణాలు, టి టి డి రాజకీయాలు, ఎన్ జీ ఓ లు అనేవి ఎవరూ కూడా టచ్ చేయడానికి సాహసం చేయని వ్యవహారాలు. కాని వాటిల్లోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్య పరిచారు. ఇక ఎన్టీఆర్ కు ఉండే జ్ఞాపక శక్తి ఒక అద్భుతంగా చెప్తారు ఆయన్ను కలిసిన వాళ్ళు. ఎవరిని అయినా కలిస్తే ఎన్టీఆర్ త్వరగా మర్చిపోయే వారు కాదట.
సామాన్యులు ఎవరైనా ఒకసారి ఆయనను కలిస్తే ఎక్కడ కలిసారో, ఏం చేస్తున్నారో కూడా ఎన్టీఆర్ గుర్తు పెట్టుకుంటారట. గ్రామాధికార వ్యవస్థను తొలగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అని ఎన్టీఆర్ పై విమర్శలు వచ్చినా సరే ఆయన వెనక్కు తగ్గలేదు. అలాగే ప్రచారం నిర్వహించే సమయంలో ఆయన ఎక్కడ ఆగితే అక్కడే భోజనం చేసేవారట. అది ఎవరి ఇల్లు అయినా సరే ఇంట్లో మనిషిలా కలిసిపోయి భోజనం చేయడం ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చింది.