మిర్చి సినిమాతో రైటర్ కాస్త స్టార్ దర్శకుడు అయిపోయాడు కొరటాల శివ. ఆ సినిమా సాధించిన సక్సెస్ తో ఆయనతో పని చేసేందుకు చాలా మంది హీరోలు, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొరటాల శివ కెరీర్ లో కాస్త బిజీగానే ఉన్నారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ వచ్చింది. అయితే చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా మాత్రం షాక్ ఇచ్చింది.
ఈ సినిమా తర్వాత కొరటాల శివ కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేసారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన ఒక సినిమా చేస్తున్నారు. తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమాను లైన్ లో పెట్టారు. ఇదిలా ఉంచితే కొరటాల శివకు పోసాని కృష్ణ మురళికి మధ్య బంధుత్వం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. కొరటాల శివకు పోసాని కృష్ణ మురళి మావయ్య అవుతారు.
ముందు కొరటాల శివ… పోసాని వద్ద రైటర్ గా చేసారు. పలు సినిమాలకు మంచి డైలాగులు రాసారు కొరటాల. భద్ర వంటి హిట్ సినిమాకు కూడా ఆయన పని చేసారు. అలా 2009 లోనే కొరటాల… అల్లు అర్జున్ తో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. కాని అది సెట్ కాక కాస్త ఆలస్యం అయింది. ఆ తర్వాత ప్రభాస్ తో చేసి మంచి హిట్ ఇచ్చారు. ఇక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కు పోసాని సూపర్ హిట్ లు ఇచ్చారు.