సినిమా నటుల మధ్య ఉండే అనుబంధాలు, బంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాని కొన్ని కొన్ని బంధాల గురించి మనకు తెలియదు కదూ…? అలా తెలియని బంధమే ప్రకాష్ రాజ్ ది, శ్రీహరిది. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఒక మాట అన్నారు. శ్రీహరి అంకుల్ ఉండి ఉంటే మీ అందరికి సమాధానం ఆయనే చెప్పే వారని. ఆ కామెంట్స్ ప్రకాష్ రాజ్ కి తగిలే విధంగా అన్నారనేది అర్ధమైంది.
అసలు శ్రీహరికి, ప్రకాష్ రాజ్ కు మధ్య బంధం ఏంటి…? ప్రకాష్ రాజ్ అలాగే శ్రీహరి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. కాని ఆ ఇద్దరికి మధ్య బంధుత్వం ఉంది. ఇద్దరూ తోడల్లుళ్ళు అవుతారు. ప్రకాష్ రాజ్ మొదటి వివాహం “డిస్కో శాంతి” రెండో సోదరి “ఓల్గా లలిత కుమారి”తో జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రకాష్ రాజ్ అనివార్య కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చారు.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఫేమస్ కొరియోగ్రాఫర్ “పోనీ వర్మ” ను రెండో వివాహం చేసుకోగా అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కాని అది ఏ మాత్రం నిజం కాదని ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉందని చాలా సందర్భాల్లో స్పష్టత వచ్చింది. వాళ్ళు ఇద్దరూ తర్వాత బృందావనం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి కీలక పాత్రలు పోషించారు.