ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య అక్కినేని సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపోతే విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా వారి వారి సినిమాలతో బిజీ అయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన కె.ఆర్.కె సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. అలాగే అంతకన్నా ముందు పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆకట్టుకుంది.ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత.
జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని అవమానాలు పడ్డాడా!?
అలాగే మరోవైపు నాగచైతన్య కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రంతో వరుస గా హిట్స్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నాగ చైతన్య శోభిత ప్రేమలో ఉన్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఆ పరిచయం జరిగిందట. అది కాస్త స్నేహంగా మారి ఇప్పుడు ప్రేమించుకుంటున్నారని టాక్ నడుస్తుంది. ఇటీవలే విడుదలైన మేజర్ సినిమాలో శోభిత నటించి మంచి సక్సెస్ సాధించింది.
హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు…క్లారిటీ!!
అయితే నాగచైతన్య కు శోభిత కు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని కానీ ప్రేమ అని జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని అక్కినేని అభిమానులు చెబుతున్నారు. కానీ ఇదే విషయమై నాగ చైతన్య శోభిత క్లారిటీ ఇస్తే బావుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు.
జూలై 22న నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తనపై వస్తున్న రూమర్స్ పై చైతు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. గతంలో కూడా సమంత వీరి పై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.