పోన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా వచ్చిన పోన్నియన్ సెల్వన్ సినిమా భిన్నమైన టాక్ తో వెళ్తుంది. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తుంది. అయితే గాడ్ ఫాథర్ సినిమా విడుదల అయితే మాత్రం ఈ సినిమా అంతగా ఆడే అవకాశాలు ఉండకపోవచ్చు అంటున్నారు. ఇక ఈ సినిమాకు పని చేసిన కీలక నటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చూద్దాం.
ఐశ్వర్య రాయ్
ఈ సినిమాలో దాదాపుగా విలన్ రోల్ చేసిన ఈమెకు 10 కోట్ల వరకు ఇచ్చారు.
ఐశ్వర్య లక్ష్మి
హంగులిగా నటించిన ఈమెకు రూ. 1.5 కోట్లు ఇచ్చారు. నటన పరంగా ఈమెకు మంచి మార్కులు పడ్డాయి.
కార్తి
ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు వల్లవరాయన్ వందిదేవన్ గా నటించిన కార్తికి రూ. 5 కోట్లు అందుకున్నారు.
జయం రవి
ఈ సినిమాలో జయం రవిది కీలక పాత్ర. అరుళ్‌మోళి వర్మన్‌గా జయం రవి నటించాడు. ఈయన రెమ్యూనరేషన్ రూ. 8 కోట్లు.
త్రిష
రాజకుమారి కుందవై పాత్రలో త్రిష నటించారు. అందుకు గాను ఈమెకు రూ. 2.5 కోట్లు ఇచ్చారు.
విక్రం
సుందర చోళుడి పెద్ద కుమారుడు చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడుగా విక్రం నటించాడు. రూ. 12 కోట్లు తీసుకున్నారని సమాచారం.
ప్రకాష్ రాజ్
చోళ సామ్రాజ్యానికి రాజు సుందర చోళుడు కాగా సుందర చోళుడి పాత్రను ప్రకాశ్‌రాజ్ పోషించారు. ఇందుకోసం ఆయనకు కోటి రూపాయలు ఇచ్చారు.