నందమూరి తారకరత్న మరణించి 15 రోజులు అవుతున్నా నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సినిమా రంగంలో కొన్ని రోజులు అలరించిన తారకరత్న… మరణించే ముందు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున పాల్గొనడానికి వెళ్లి మరణించారు.
ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో ఆయనకు దాదాపు 20 రోజుల పాటు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఇక నిన్న ఆయన 13 రోజుల కార్యక్రమాన్ని నందమూరి కుటుంబం పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. ప్రస్తుతం తారకరత్న గురించి ఒక విషయం వైరల్ గా మారింది. అదే ఆయన మొదటి సినిమా పారితోషికం.
మొదటి సినిమాకు తారకరత్న తీసుకున్న పారితోషికం అప్పట్లో కాస్త ఎక్కువే అని చెప్పాలి. వైజయంతి మూవీస్ లో ఒకటో నంబర్ కుర్రాడు అనే సినిమా చేసాడు తారకరత్న. ఆ సినిమా కోసం బడ్జెట్ కాస్త ఎక్కువే అయింది. బడ్జెట్ పెరిగినా హీరోకి మాత్రం 10 లక్షలు ఇచ్చామని అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తారకరత్న ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసి సంచలనం సృష్టించారు.