తెలుగు సినిమా పరిశ్రమలో యాంకర్ సుమ అంటే ఒక సంచలనం. ఆమె పేరు వింటే చాలా తెలుగు ప్రేక్షకులకు ఆమె నోటి నుంచి వచ్చే స్పష్టమైన తెలుగు వినపడుతుంది. ఎలాంటి షో లో అయినా సరే ఉత్సాహంగా ఆమె పాల్గొనే విధానం ఆమె టైమింగ్ అన్నీ కూడా నచ్చుతాయి. ఇక సుమా విషయంలో ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటీ అనేది చాలా మందికి తెలియదు.
Also Read:డెబిట్, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
ఎంత మంది కుర్ర యాంకర్ లు ఉన్నా సరే సుమా డిమాండ్ పెరగడమే గాని తగ్గడం లేదు. అసలు ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటో చూద్దాం. కేరళ అమ్మాయి అయినా సరే ఆమె తెలుగు మాట్లాడే విధానం చూసి మైండ్ పోతుంది. ఎలాంటి షో లో అయినా సరే షో కి తగిన విధంగా తెలుగులోనే జోక్స్ కూడా వేస్తుంది. ఇక ఆమె పట్టుదల మరో కారణం అయితే కుర్ర యాంకర్ లకు అందని ఎత్తులోకి వెళ్ళడానికి ఎప్పటికప్పుడు తనలో తాను మార్పులు చేసుకుంటుంది.
ఇక భార్యగా, కోడలిగా, తల్లిగా ఆమె ఏ పాత్రను కూడా లైట్ తీసుకోలేదు. మొదట్లో సినీ నటిగా కళాజీవితం మొదలుపెట్టిన ఆమె అక్కడ పెద్దగా అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారు. అయితే సుమకు ఆ వాతావరణం పడలేదు అంటారు. అయితే యాంకర్ గా వచ్చిన తర్వాత ప్రధానంగా తెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం ఆమె కెరీర్ స్పీడ్ అందుకుంది. ఉదయ భాను, ఝాన్సి వంటి వాళ్ళు ఆమె రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోలేదు. ఇక ఆమె షో లో వేసే జోక్స్ గాని టైమింగ్ గాని సుమకు బాగా ప్లస్. భర్త నుంచి ఆమెకు ఉండే ప్రోత్సాహం, సినిమా పరిశ్రమలో ఆమెకు ఉండే పరిచయాలు అన్నీ కూడా సుమాకు బాగా కలిసి వచ్చాయి.
Also Read:విజయవాడ అత్యాచార ఘటనలో.. ఇద్దరు పోలీసులు సస్పెండ్