టాలీవుడ్ లో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలు, సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. ఏ హీరో అయినా సరే బ్రహ్మీ ఉంటే తమ సినిమాలు హిట్ అవుతాయి అనే భావనలో ఉండే వారు. ఆయన కామెడి చూడటానికి అయినా సరే సినిమాకు వచ్చే వాళ్ళు అభిమానులు. ఇప్పుడు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.
సినిమాల్లో హీరోలే కామెడి చేయడంతో ఇప్పుడు కమెడియన్ ల పాత్ర కాస్త తగ్గింది. ఇదిలా ఉంటే… ఆయన ఆ రేంజ్ లో సక్సెస్ కావడానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. బ్రహ్మానందం ప్రారంభ దశలో తెలుగు పండితులు గా పని చేయడం ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం. ఏ పాత్రలో అయినా సరే ఆయన తెలుగుని చాలా అందంగా మాట్లాడతారు. అందుకే పౌరోహిత్యం కూడా అందంగా ఉంటుంది.
ఆయనకు ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది స్పష్టంగా తెలుసు. అందుకే సినిమా పెద్దలతో ఆయనకు మంచి పరిచయాలు ఏర్పడటానికి అదే ప్రధాన బలం. ఈ లౌకిక జ్ఞానము ఆయనకు రంగంలో బాగా ఉపయోగపడింది. దానికి తోడు ఏ పాత్ర అయినా సరే కామేడిలో ఆయన పోషించడానికి రెడీ అయ్యారు. అందుకే చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఇగో లేకుండా సినిమాలు చేసారు.
ఇక ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అందుకే చాలా మంది దర్శకులు ఆయనను ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చి తీసుకునే వారు. సినిమా కథ ఎలా ఉన్నా సరే ఆయన కామెడి పండితే చాలు అన్నట్టుగా పరిస్థితి తయారు అయింది. ఇదే ఆయనకు బలంగా మారింది. ఎందరు కమెడియన్ లు వచ్చినా ఆయన స్థాయిని అందుకోలేకపోవడానికి ఇవే కారణాలు.