సౌత్ ఇండియన్ సినిమాలో సాయి పల్లవి చాలా ఫాస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సమానంగా ఆమెకు గుర్తింపు వచ్చింది. హీరో ఎవరనేది పక్కన పెట్టి కేవలం సాయి పల్లవి చేసే నటన, డాన్స్ కు ప్రత్యేకంగా ఫాన్స్ ఉన్నారు. హీరోని అన్ని విధాలుగా డామినేట్ చేస్తూ హీరోయిన్ అంటే హీరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు… సినిమాలో ఆ రోల్ కు కూడా ఒక పవర్ ఉందని నిరూపించింది.
అసలు సాయి పల్లవి ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటీ…? ఆమెకు బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
డాన్స్: స్వతహాగా ఆమె మంచి డాన్సర్, జార్జియాలో మెడిసిన్ చదివే సమయంలో ఆమె నుంచి వచ్చిన ఒక వీడియో బాగా ఆకట్టుకుంది. టీవీ లలో తాను చేసిన కార్యక్రమాలతో కూడా మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. ఇక తాను చేసిన తొలి సినిమా ప్రేమంతో ఆమెలో డాన్సర్ తో పాటుగా మంచి నటి కూడా బయటకు వచ్చింది. ఆమె డాన్స్ ను అన్ని సినిమాల్లో కంటిన్యూ చేస్తూ అదిరిపోయే స్టెప్స్ వేస్తూ హీరోలకు సవాల్ చేస్తుంది. ఆమె వేసే స్టెప్స్ ను ప్రత్యేకంగా రీల్స్ సహా పలు షార్ట్ వీడియోస్ లో వైరల్ చేస్తారు ఫాన్స్.
నటన: సాయి పల్లవి నటన న్యాచురల్ గా ఉంటుంది. ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోతుంది. దర్శకుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది తన నటనలో వంద శాతం చూపిస్తూ డైరెక్టర్స్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. హీరోయిన్ అంటే కేవలం అందంగా ఉండటమే కాదు నటన కూడా ఉండాలని ప్రూవ్ చేసుకుంది. అమ్మాయిలు హైపర్ యాక్టివ్ ఉంటే బాగుంటారు అనేది ప్రూవ్ చేసి లేడీ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.
ఫిదా టర్నింగ్ పాయింట్: తెలుగులో ఆమెను పరిచయం చేసిన సినిమా ఫిదా. అప్పటి వరకు తెలంగాణా యాస అంటే హీరోల ఫ్రెండ్స్ లేదా విలన్స్, ఎవరో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే మాట్లాడతారు అనుకునేలా ఉండేది. కాని ఫిదా సినిమాతో ఆమె నోటి నుంచి వచ్చిన అందమైన మాటలు, వినాలిపించే బూతులు, తెలంగాణా యాసను దర్శకుడి ఆలోచనకు తగ్గట్టు ఆమె పలికిన విధానం, ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆమె డాన్స్ అన్నీ హైలెట్ అయి ఆమె క్రేజ్ ను పెంచి… ఫిదా సినిమా అంటే ఓన్లీ సాయి పల్లవి అనేలా ప్రూవ్ చేసుకుంది. ఇంట్లో ఆడపిల్ల మాదిరి తెలుగు వాళ్లకు దగ్గరైంది.
ఇతర హీరోయిన్ లు అందంతో సినిమాలు చేస్తుంటే సాయి పల్లవి కేవలం నటనలో అందం, డాన్స్ లో వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక మొటిమలు కూడా అమ్మాయిలకు అందంగా ఉంటాయని ప్రూవ్ చేసింది సాయి పల్లవి. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచెను మనసు, మారి 2, అథిరన్ సహా పలు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.