టాలీవుడ్ లో అన్నీ కలిసి వచ్చినా సరే అద్రుష్టం కలిసి రాక కెరీర్ లో ఇబ్బంది పడుతున్న హీరో కళ్యాణ్ రామ్. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నా సరే ఆయనకు అద్రుష్టం మాత్రం పెద్దగా కలిసి రావడం లేదనే టాక్ ఉంది. అందుకే కెరీర్ లో సక్సెస్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వచ్చిన బింబిసార సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయన మరింత స్పీడ్ గా వెళ్తున్నారు.
బింబిసార సినిమాతో ఆయన వద్దకు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. ఇక నిర్మాతగా కూడా సినిమాలను వేగంగా చేసే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ సినిమాలో వస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అమిగోస్ అనే సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు. ఇక తాజాగా తన చేతి మీద ఉన్న టాటూ గురించి కళ్యాణ్ రామ్ ఒక వివరణ కూడా ఇచ్చాడు.
2007 లో తనకు తీవ్రమైన అనారోగ్యం వచ్చిందని ఆ సమయంలో నర్సుల కంటే కూడా తన భార్య తనకు ఎక్కువ సేవ చేసిందని అందుకే తన పేరు స్వాతి కావడంతో స్వాతి అనే పేరు ని టాటూ వేయించుకున్నా అని తెలిపాడు. తనకు సూదులు అంటే చాలా భయం అని కాని భార్య మీద ఉన్న ప్రేమతో అలా టాటూ వేయించాను అని చెప్పాడు. తన భార్య తనకు బాగా సపోర్ట్ చేస్తుందని వివరించాడు.