మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చిరంజీవి తెలియని వారుండరు. చిరు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. అలాగే ఒకప్పుడు టాప్ కమెడియన్ గా, విలన్ గా ఉన్న సుధాకర్ గురించి కూడా పరిచయాలు అవసరం లేదు.
ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మెగాస్టార్ తో పాటు నటులు హరి ప్రసాద్, సుధాకర్ రూమ్ మేట్స్ గా ఉండేవారు. వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా ఆఫీస్ లకి వెళ్లి ఆడిషన్స్ ఇస్తూ ఉండేవారు. అలా ఒకానొక సమయంలో వీళ్ళకి తినడానికి తిండి దొరికేది కాదు.. డబ్బులు కూడా ఉండేవి కావు.. అలాంటి టైమ్ లో కొన్ని సార్లు పస్తులు కూడా ఉండేవాళ్ళు.
ఒకరోజు ఇవాళ ఏం కూర చేసుకుందామని వీళ్ల ముగ్గురు ఆలోచిస్తుండగా.. సుధాకర్ కి వాళ్ల పక్కింట్లో ఒక ములక్కాయ చెట్టు కనిపించింది. గోడ ఎక్కి ఆ ములక్కాయలు తెంపి కర్రీ వండారు. అలా వండుకున్న కూర ముగ్గురు వేసుకొని తింటుంటే.. ఆ పక్కింటి ఆయన వచ్చి మా చెట్టు ములక్కాయలే తెంపుతావా? అంటూ పెద్ద గొడవ చేసాడట.
అంతేకాకుండా వాళ్లు వండుకున్న కూరను కూడా తీసుకొని వెళ్ళాడట. అలా జరగడంతో వాళ్ళకి చాలా అవమానం అనిపించిందట. ఆ తరువాత వాళ్ళు ఇంకా కసిగా ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయి సినిమాలు చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ చెప్పారు.