మనం తరుచుగా వినే పదం టీఆర్పీ రేటింగ్. టీవీలు చూసే వాళ్లకు ఇది కాస్త ఎక్కువ పరిచయమే కదా…? అసలు టీఆర్పీ రేటింగ్ అంటే ఏంటీ, దాన్ని ఏ విధంగా చూస్తారో ఒక్కసారి చూద్దాం.
దాని పూర్తి వివరణ టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది ఏ ఛానెల్ లేదా ప్రోగ్రామ్‌ను ఎక్కువగా ప్రేక్షకులు చూస్తున్నారో చెప్పే సాధనం. సదరు ఛానల్ లేదా అందులో ప్రసారమయ్యే ప్రోగ్రాం కు ఉన్న ప్రజాదరణ చెప్తుంది. ఇక చూసే వాళ్ళు ఎన్ని సార్లు చూస్తున్నారో కూడా చెప్తుంది. దీనితో ఛానల్ లో పెట్టుబడి పెట్టె వాళ్లకు ఒక క్లారిటీ ఉంటుంది. యాడ్స్ ఇచ్చే వాళ్లకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
Also Read: తెలుగు సినిమాలో పాపులారిటీకి దూరంగా, ఆఫర్లకు దగ్గరగా ఉండే ముగ్గురు నటులు…!

INTAM అలాగే DART అనే భారతీయ ఏజెన్సీల ద్వారా దీన్ని లెక్కిస్తారు. ప్రస్తుతం INTAM ద్వారా టీఆర్పీ కొలుస్తున్నారు. దూరదర్శన్ ఆడియన్స్ రీసెర్చ్ టీవీ రేటింగ్స్ అయిన DART ద్వారా గతంలో చూసే వారు. ఆ టైం లో దూరదర్శన్ మాత్రమే అందుబాటులో ఉండేది కాబట్టి ఆ ఛానల్ మాత్రమే చూసారు. అయితే DART ఉనికిలో ఇప్పటికీ ఉంది. సెలెక్ట్ చేసిన వ్యక్తులను కాకుండా ర్యాండం గా దీన్ని లెక్కిస్తారు.

వివిధ ఛానెల్‌లు అలాగే టీవీ ప్రోగ్రామ్‌ల గురించి వారిని ప్రశ్నిస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతులను కూడా ఉపయోగించి లెక్కిస్తారు. ఏదైనా ప్రోగ్రామ్ టీఆర్పీ పెరుగుదల లేదా తగ్గుదల అనేది నేరుగా ప్రోగ్రామ్ వచ్చే టీవీ ఛానెల్ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే వినూత్నంగా ఉండే కార్యక్రమాల మీద ఎక్కువగా చానల్స్ దృష్టి సారిస్తాయి. ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలను రూపొందిస్తే మంచి లాభం ఉంటుంది.
Also Read: ఫోటో ఏ టైం లో తీస్తే బాగుంటుంది…? సూర్యుడి గోల్డెన్ అవర్ అంటే ఏంటీ…?