ట్విన్డెమిక్” ప్రపంచ వ్యాప్తంగా నిపుణులను కంగారు పెడుతున్న పదం. అసలు ట్విన్డెమిక్ అంటే ఏంటీ అనేది చాలా మందికి క్లారిటీ లేదు. పాండమిక్ ను మార్చి ట్విన్డెమిక్ అని పిలుస్తున్నారు. అసలు ఎందుకు మార్చారు…? ట్విన్డెమిక్ అని ఎందుకు అన్నారు…?
కరోనా వైరస్ రెండేళ్ళ నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. దీన్ని మహమ్మారిగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు ఫ్లూ కూడా ఇబ్బంది పెడుతుంది ప్రపంచ వ్యాప్తంగా. యూరప్ దేశాల్లో ఫ్లూ వైరస్ దెబ్బ గట్టిగానే తగులుతుంది. దీనితో కూడా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనాతో పాటుగా 2021 చివరిలో ఫ్లూ వైరస్ యూరప్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ రేటుతో వ్యాపించడం ఆందోళన కలిగిస్తుంది.
దీనితో రెండింటిని కలిపి ట్విన్డెమిక్ అని పిలుస్తున్నారు. అంటే కవల మహమ్మారి అని… యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డిసెంబర్‌లో ఐసియులో ఫ్లూ కేసుల సంఖ్య పెరిగింది. ఫ్లూ వైరస్… ప్రపంచ వ్యాప్త అంచనా ప్రకారం సంవత్సరానికి 6,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ్లూ మరియు కోవిడ్-19 వైరస్‌లు వాటి పాథోజెనిసిస్‌లో విభిన్నంగా ఉన్నప్పటికీ, రెండు కేసులు ఏకకాలంలో పెరగడానికి అనువైన పరిస్థితి ఉంది.
ఫ్లూ మరియు కోవిడ్-19 వైరస్‌ల మధ్య తేడాను గుర్తించడం వైద్యులకు సైతం ఇబ్బందిగా మారింది. 2020లో, చిలీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు యూరప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు రెండు వైరస్ లను ఎదుర్కొన్నాయి. అనేక దేశాలలో కోవిడ్-19, ఫ్లూ వైరస్ లకు సంబంధించిన కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్న నేపధ్యంలో ‘ట్విండమిక్’ అని పిలవడం మొదలుపెట్టారు.