Vishitha Kiran: ‘చిత్రం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంతే చిత్రంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. అతను చనిపోయి ఏళ్ళు గడుస్తున్నా..అప్పడప్పుడూ తాను నటించిన సినిమాలు చూస్తున్నప్పుడు అయ్యోపాపం అనిపిస్తుంది.నిజానికి ఉదయ్ ని మర్చిపోవడం అంత ఈజీ కాదు.

తెలుగు ఇండస్ట్రీ పై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది. మధ్యలో కొన్నేళ్లపాటు ధ్రువతారగా వెలిగిపోయారు.అనుకోని కారణాలు,కొన్ని ఊహించని ఇబ్బందులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నేళ్ళు వార్తలు వచ్చాయి.
Udaykiran Wife Vishitha Kiran
కానీ అవి కారణం కాదు అంటూ ఆ మధ్య ఉదయ్ కిరణ్ అక్క సంచలన ఆరోపణలు చేసింది. కుటుంబ కలహాలతోనే చనిపోయాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడింది ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి. తన తమ్ముడు కోటీశ్వరుడని..డబ్బుల్లేక చనిపోవాల్సిన కర్మ పట్ట లేదని చెప్పింది.
భార్య విషిత పైనే తమకు అనుమానాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది. అయితే వీటిపై ఉదయ్ కిరణ్ భార్య స్పందించలేదు. ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి 11 రోజులు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నది కూడా లేదని ఉదయ్ అక్క చెప్పింది.
అయితే అప్పట్లో విషిత పై ఆరోపణలు చేసినప్పటికీ ఆమె బయటికి రాకపోతే ఉదయ్ కిరణ్ మరణానికి ఆమె కారణం అని అంతా అనుకున్నారు. అసలు ఇప్పుడు ఉదయ్ భార్య ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారింది.
ఈమె ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. నిజానికి ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకోక ముందు కూడా ఈమె ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా పని చేసేది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.
అయితే సినిమాల్లో అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ఉదయ్ ని బాగు చేయడానికి చాలా ప్రయత్నించిందట విషిత. ఈ విషయం ఆమె సన్నిహితులు కూడా చెబుతుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఉదయ్ మామూలు మనిషి కాలేకపోయాడు.
ఒకానొక సమయంలో ఆయనకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించిదని తెలుగు కాకపోతే తమిళ్ ఇండస్ట్రీ లో చూసుకుందామని అక్కడ 25 వేలు పెట్టి ఒక ఫ్లాట్ కూడా తీసుకుందని చెబుతుంటారు తెలిసినవాళ్లు.ఉదయ్ కోసం ఎంత చేసినా కూడా ఓ రోజు విషిత లేని సమయం చూసి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అతను చనిపోయిన తరువాత కూడా విషిత మరో పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీకెండ్ లో అనాథశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చనిపోయిన భర్తను తలుచుకొని ఇప్పటికీ బాధపడుతున్నట్లు తన సన్నిహితులు చెబుతున్నారు.