ఈ మధ్య కాలంలో మనం వైఫై కాలింగ్ అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఆండ్రాయిడ్ ఫోన్ లో గమనిస్తే ఫోన్ చేసిన తర్వాత పక్కన వైఫై సింబల్ పడుతుంది. అసలు ఈ వైఫై కాలింగ్ అంటే ఏంటీ…? దాన్ని ఏయే సందర్భాల్లో మనం ఉపయోగించడానికి సాధ్యపడుతుంది అనేది ఈ స్టోరీలో చూద్దాం. మన మొబైల్ ఫోన్లు నుండి ఎవరికి అయినా ఫోన్ చేయాలి అంటే సిం కార్డు సిగ్నల్ నుంచి చేస్తాం.
Also Read:యాపిల్ ప్రొడక్ట్స్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటాయి…?
ఈ వైఫై కాలింగ్ తో మన సింకార్డ్ సిగ్నల్ తో సంబంధం లేకుండా వైఫై సిగ్నల్ ద్వారా కాల్స్ మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మన ఇంట్లో బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్, వైఫై రూటర్ ఉంటే దాని మన మొబైల్ కి వైఫై కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో ” వైఫై కాలింగ్” కి అనుమతి ఇస్తే ఇది సాధ్యమవుతుంది. వైఫై సిగ్నల్ ఆధారం గా కాల్స్ రావడం వెళ్ళడంతో సిగ్నల్ లేకపోయినా ప్రాబ్లం ఉండదు.
ఎవరి ఇంట్లో ఐనా, సిం కార్డ్ సిగ్నల్ లేకపోతే ఈ వైఫై కాలింగ్ హెల్ప్ అవుతుంది. మనము వాడే సిమ్/ సర్వీస్ ప్రొవైడరు కూడా వై-ఫై కాలింగ్ ను సపోర్టు చెయ్యాల్సి ఉంటుంది. వాయిస్ కాల్ అయితే నిమిషానికి ఒక ఎంబీ ఖర్చు అవుతుంది. వీడియో కాల్ అయితే నిమిషానికి 6-8 MB అటు ఇటు గా అవుతుంది. అవతలి వ్యక్తి వైఫై కాలింగ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్నా లేకపోయినా సరే… మనకు ఉంటే చాలు కాల్ చేయవచ్చు.
Also Read:రాహుల్ ఓయూ టూర్..హైకోర్టు కీలక ఆదేశాలు..!