ఉదయ్ కిరణ్….తెలుగు తెరపై ఎగసిపడిన యువకెరటం. సూదంటి ముక్కు, చొట్టబుగ్గలు, చూపులో, మాటలో అమాయకత్వం కలగలిసిన అందాల నటుడు. అందుకే తొలి సినిమాతోనే తెలువారి హృదయాలకు దగ్గరయ్యాడు. హ్యాట్రిక్ హిట్స్ తో ఒక వెలుగు వెలిగాడు. చక్కగా వెళ్ళే కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యింది. సక్సెస్, పర్సనల్ రీజన్స్, గైడెన్స్ కొరవడి చాలాకాలం ప్రేక్షకులకు కనుమరుగైపోయాడు.
ఆ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యలకు, ప్రేక్షకులకు శాశ్వతంగా దూరమైపోయాడు. అయితే…ఉదయ్ కు సంబంధించిన ఓ వార్త తాజాగా వైరల్ అవుతోంది. చాలామందికి ఉదయ్ కిరణ్ అనగానే అతను చేసిన మొదటి సినిమా ‘చిత్రం’ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అతని కెరీర్ బిగినింగ్ లో హిందీ, ఇంగ్లీష్ బైలింగ్వల్ సినిమా చేసాడు. దాని పేరు ‘‘మిస్టీరియస్ గర్ల్”. ఈ సినిమాను ఎవరూ కొనకపోవడంతో థియేటర్స్ దాకా రాలేదు. కాబట్టి ఎవరికీ పెద్దగా తెలియదు.
Also Read: వాల్తేరు వీరయ్య….ఇదేందయ్యా..!?
2003లో ఉదయ్ కిరణ్ కి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత విడుదల చేయాలని చూశారు. కానీ, ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా విడుదలకు నోచుకోలేదు. అయితే.. ఆ సినిమాకు అతనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. ఎందరో యువకులు సినిమాల్లో నటించడానికి పోటీ పడే సమయంలో 18 ఏళ్ళకే ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి యువ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్. తెలుగువారి పక్కింటి కుర్రాడయ్యాడు.
ఇక ఇతను నటించిన మొదటి సినిమా కూడా ఒక సంచలనమే. చేసిన మొదటి ప్రయత్నమే హిందీ, ఆంగ్లం బైలింగ్వల్ సినిమా చేయడం గొప్ప విషయం అయినప్పటికీ థియేటర్స్ దాకా రాకపోవడం బాధాకరం.
Also Read: అంజలి ఇంట్లో చోరీ.. నిధి జోక్యంపై అనుమానం