సైరా రిలీజ్ అవటంతో… అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. పోరాట యోధుడిగా చిరంజీవిని చూడాలని వుంది అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా, సైరా తర్వాత ఏంటీ అన్న చర్చ కూడా ఇప్పుడే మొదలైపోయింది. సైరా తర్వాత చిరు కొరటాలకు డేట్స్ ఇచ్చేశాడు. అయితే, శివ సినిమా లైన్ ఏంటీ అన్నది ఇప్పుడు ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది. భరత్ అనే నేను లాగే ఇక్కడా పొలిటికల్‌గా ఉంటుందా, పొలిటికల్ సినిమాను చిరు ఎంకరేజ్ చేస్తారా అన్నది అసలు చర్చ. రాజకీయాలు వద్దంటూ చిరు తన సన్నిహితులకు హితబోధ చేస్తూ… మళ్లీ పొలిటికల్ ఫిల్మ్ చేయకపోవచ్చని కానీ ఆర్మీ ఆఫీసర్‌గా చిరు ఉండొచ్చు అనేది టాక్. అయితే ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటించనుందనేది ఇండస్ట్రీ సమాచారం.