భోజనం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు కాకుండా కొన్ని కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇక భోజనం తర్వాత ఏం ఏం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. భోజనము చేయగానే నడవడం మంచిది కాదు. భోజనం చేయగానే వంద అడుగులు వేస్తే వందేళ్ళు బ్రతికే అవకాశం ఉందని అంటారు. కాని అలా నడిస్తే… మనం తిన్న ఆహారంలోని పోషకాలను మన నడకతో ప్రతికూల చర్య వలన శరీరం గ్రహించలేదు.
Also Read:కేటీఆర్ ఖబర్దార్.. నిరసన బాటపట్టిన విశ్వ బ్రాహ్మణులు!
భోజనం తర్వాత పడుకోవడం మంచిది కాదు. భోజనం చేయగానే పడుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు. అందుకే జీర్ణకోశ వ్యాధులు… గ్యాస్ట్రిక్ మరియు ఉదరకోశ సమస్యలు వస్తాయి. ఇక భోజనం తర్వాత పళ్లు తినడం మంచిది కాదు. భోజనం చేయగానే పళ్లు తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. టీ తాగడం కూడా భోజనం తర్వాత మంచిది కాదు. టీ ఆకుల్లో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి.
మనం తిన్న ఫ్రొటీన్ కలిగిన ఆహారము ఆమ్లాలతో చర్య జరిగి జీర్ణక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక భోజనం తర్వాత నడుము బెల్టు వదులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆహరం సులువుగా ఒక్కసారిగా కిందకు జారితే ప్రేగులు మడతబడటం లేదా మూసుకునే అవకాశం ఉంటుంది. స్నానం చేయడం కూడా మంచిది కాదు. స్నానం చేస్తే కాళ్లకు చేతులకు అధిక రక్త ప్రసరణ జరుగుతుంది. అందుకే కడుపుకు తక్కువ రక్తప్రసరణ జరగడం వలన జీర్ణక్రియ మందంగా ఉంటుంది. భోజనం తర్వాత సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ప్రూవ్ అయింది.