భోజనం చేసిన తర్వాత అది చేయాలి ఇది చేయాలని కొందరికి ఉంటుంది. అక్కడి వరకు బాగానే ఉంది… భోజనం చేసిన వెంట ఇలా చేయాలని అలా చేయాలని సలహాలు ఇస్తారు. అసలు మనం భోజనం చేసిన వెంటనే ఏం చేయకూడదు అనేది చాలా మందికి తెలియదు. అసలు మనం ఏం చేయకూడదు ఏంటీ అనేది ఒకసారి చూస్తే…
Also Read:యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు చేయొద్దు
భోజనము చేయగానే నడవడం ఎంత మాత్రం మంచిది కాదు. తిన్న వెంటనే వంద అడుగులు నడిస్తే 99 ఏళ్ళు బతుకుతారని చెప్తారు గాని… జీర్ణక్రియ ప్రక్రియ లో మనము తిన్న ఆహారంలోని పోషకాలు మన నడకతో ఏర్పడే ప్రతికూల చర్య కారణంగా శరీరం గ్రహించలేదు. భోజనం చేయగానే పడుకోవడం కూడా మంచిది కాదు. పడుకుంటే మాత్రం జీర్ణక్రియ సక్రమంగా జరిగే అవకాశం ఉండదు.
దీనితో జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ మరియు ఉదరకోశ సమస్యలు ఏర్పడతాయి. అందుకే తిన్న కాసేపటికి పడుకోవడాలి. భోజనం చేయగానే పళ్ళు తినడం కూడా మంచిది కాదు. పళ్లు తింటే కడుపు ఉబ్బరం వస్తుంది. పళ్లను భోజనానికి గంట ముందు లేదా ఒకటిరెండు గంటల తర్వాత తినడం బెటర్. ఇక టీ తాగడం కూడా మంచిది కాదు. ఆమ్ల గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి… తిన్న ఫ్రొటీన్ కలిగిన ఆహారం ఆమ్లాలతో చర్య జరిగి జీర్ణక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తిన్న తర్వాత స్నానం చేయడం మంచిది కాదు. తర్వాత స్నానం చేయటంతో శరీరానికి, కాళ్లకు చేతులకు అధిక రక్త ప్రసరణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పొట్టకు తక్కువ రక్తప్రసరణ జరిగి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భోజనం చేసిన తర్వాత పొగ తాగితే కచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రూవ్ అయింది.
Also Read:యోగీ అనే నేను… ప్రమాణం చేసిన సీఎం