విమాన ప్రయాణం చేసే సమయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తేడా వచ్చే ఏ వస్తువు అయినా సరే మన లగేజ్ లో ఉండటానికి భద్రతా సిబ్బంది అంగీకరించరు. కాబట్టి ప్రయాణానికి ముందు ఏం ఉండాలి… ఏం ఉండకూడదు అనేది తెలుసుకునే విమానాశ్రయంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. అయితే విమాన ప్రయాణంలో ఏం ఉండకూడదు అనేది చూస్తే…
Also Read:రాజయ్య.. ఇదేందయ్యా..!
ఎప్పటికప్పుడు ఈ నిబంధనలు మార్చుకుంటూ వస్తున్నారు. విమాన ప్రయాణానికి లగేజ్ అని సాధారణీకరించలేము. అంతర్జాతీయ ప్రయాణానికి పరిమితులు చాలా ఎక్కువ, దేశీయ ప్రయాణానికి కొంత వెసులుబాటు ఉంటుంది. మళ్లీ దీనిలో క్యాబిన్‌లో తీసికెళ్లే వస్తువులని పరిమితులు చాలా ఎక్కువ. చెకిన్ లగేజీకి వేరే పరిమితులు ఉంటాయి. చెకిన్ లగేజీకి ఉండే పరిమితులన్నీ క్యాబిన్ లగేజికి వర్తిస్తాయి.
పదునైన వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్ వంటివి, 100 మి.లీ. దాటి లిక్విడ్/జెల్స్ (మంచి నీరు, శానిటైజర్లు సహా), తుపాకీ, రసాయనాలు, పేలుడు పదార్ధాలు వంటివి హ్యాండ్ లగేజ్ లో తీసుకువెళ్ళడం మంచిది కాదు. చెకిన్ లగేజ్ విషయానికి వస్తే బ్యాటరీ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, విత్తనాలుగా ఉపయోగపడే పదార్ధాలు (అంటే, వేరుశనగ పలుకులు లాంటివి) తుపాకి, కొన్ని రకాల రసాయనాలు, పేలే అవకాశం ఉన్నవి తీసుకువెళ్ళడం మంచిది కాదు.
Also Read:ఫోన్ ఎప్పుడు పేలే అవకాశాలు ఉంటాయి…? చార్జింగ్ పెడుతూ ఫోన్ వాడటం మంచిదా…?