పెద్ద పెద్ద స్టార్లు, క్రేజీ హీరోయిన్లు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు కామన్ గా సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎవరి అభిరుచులు వాళ్లవి. హీరోయిన్ రకుల్ ప్రీత్ కు కూడా అలాంటి కొన్ని అభిరుచులున్నాయి. స్ట్రిక్ట్ గా టైమ్ టేబుల్ ఫాలో అయ్యే ఈ ముద్దుగుమ్మ.. హాలిడే వస్తే ఏం చేస్తుందో చూద్దాం.
“నా లైఫ్ లో నార్మల్ డే ఉండదు. ఖాళీ సమయంలో కూడా ఓ 10 పనులు చేస్తుంటా. కాకపోతే మిగతా రోజుల్లా టైమ్ టేబుల్ మాత్రం పెట్టుకోను. సాధారణ రోజుల్లో కచ్చితంగా టైమ్ టేబుల్ ఫాలో అవుతాను. రిలాక్స్ అవ్వాల్సిన రోజున మాత్రం టైమ్ టేబుల్ ఫాలో అవ్వను. కానీ కాస్త లేటుగా అయినా అన్ని పనులు జరుగుతాయి. అవి కాకుండా గోల్ఫ్ ఆడతాను. ముంబయి వీధుల్లో తిరగడానికి ఇష్టపడతాను. ఇంట్లో ఏదో ఒక సినిమా చూస్తాను. అప్పటికే మనసులో ఏమైనా వంటకాలు అనుకుంటే బయటకెళ్లి అవి తింటాను.”
రెగ్యులర్ షూటింగ్ డేస్ లో మంచి వంటకం లేదా మంచి రెస్టారెంట్ ఏదైనా కనిపిస్తే వెంటనే నోట్ చేసుకుంటుందట రకుల్. తనకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఆ వంటకం తినడానికి లేదా ఆ రెస్టారెంట్ కు వెళ్లడానికి ట్రై చేస్తుందట. ఇక విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే మాత్రం కనీసం 4 నెలల ముందే ప్లాన్ చేసుకుంటుందట. అలా ప్లాన్ చేయకపోతే చాలా కష్టం అంటోంది.
మరోవైపు బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో లైఫ్ చాలా బాగుందని తెలిపిన రకుల్ ప్రీత్.. తమ రిలేషన్ షిప్ గురించి చెప్పడానికి అంతకుమించే ఇంకే లేదని తేల్చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ తన హిందీ రిలీజెస్ కోసం వెయిట్ చేస్తోంది. తమిళ్ లో త్వరలోనే అజిత్ సరసన నటించబోతోంది రకుల్.