పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మైలేజ్ కోసం ప్రజలు తీవ్రంగా కష్టపడుతున్నారు. మైలేజ్ వచ్చే బండ్లను కొనడానికి అలాగే వాడే బండి మైలేజ్ పెరగడానికి కష్టపడుతున్నారు. ఇక బండి నడిపేటప్పుడు మంచి మైలేజ్ పొందడానికి చాలా సూత్రాలు వాడాలి. ఏ విధంగా బండిని జాగ్రత్తగా చూసుకుంటే మైలేజ్ వస్తుంది అనేది పక్కాగా తెలుసుకోవాలి.
Also Read:రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన సీఎం
మొట్ట మొదటి విషయం ఏంటీ అంటే… టైర్లలో గాలి ఉండే విధంగా చూడాలి. బండికి కానీ కారుకు గాని టైర్లలో సరిపడ పీడనంతో, గాలి ఉన్నప్పుడే, ఇంజన్ మీద భారం పడదు. గతుకులు ఉన్న రోడ్ల మీద వెళ్ళిన సమయంలో టైర్లు వేగంగా అరిగిపోయే అవకాశాలు ఉండవు. ఇక మరో కీలక విషయం… టాంక్లో సరిపడినంత పెట్రోల్ తప్పకుండా ఉండేలా చూడాలి. ఇప్పుడు బీ యస్ 6 నుండి వచ్చే ఆటోమొబైల్స్ కి ఈ సమస్య తక్కువ.
ఏదైనా పాత వెహికిల్ అయ్యి ఉంటే, పెట్రోల్ పూర్తిగా అయిపోయేంతవరకు బండి నడిపితే ఇబ్బందులు వస్తాయి. ట్యాంక్ లో ఉండే డస్ట్ పార్టికల్స్ , కార్బురేటర్ ఎంట్రీ దగ్గర బ్లాక్ అయిపోయి ఇంజన్ లైఫ్ తగ్గుతుంది. అదే విధంగా పెట్రోల్ కొట్టించిన వెంటనే బండి స్టార్ట్ అవ్వక పోవడం పెద్ద సమస్య. దీనితో… ఇంజన్ ఎక్కువ పని చేస్తుంది. అప్పుడు మైలేజ్ తగ్గుతుంది.
ఇక మరొకటి రెగ్యులర్ గా ఇంజన్ ఆయిల్ మార్చడం అలవాటు చేసుకోండి. కనీసం నాలుగు నెలల నుండి ఆరు నెలల మధ్యలో ఇంజన్ ఆయిల్ మార్చడం ఉత్తమం. ఇక కొట్టించే పెట్రోల్ కూడా క్వాలిటీ గా లేకపోతే ఇంజిన్ లైఫ్ తగ్గుతుంది. అలాగే బండిని ఒక్క సారిగా రైస్ చెయ్యడం కరెక్ట్ కాదు. అలాగే స్పీడ్ పెంచడం కూడా మంచిది కాదు. అలా చేస్తే కార్బురేటర్ దగ్గర ఫ్యూయల్ ఎయిర్ రేషియో అనేది ఎక్కువ అయిపోయి ఎక్కువ పెట్రోల్ తో తక్కువ మైలేజ్ ఇచ్చే స్థితికి ఇంజన్ చేరుతుంది. ఇక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరంగా బ్రేక్ వేయడం మంచిది కాదు. అవసరం లేకుండా గేర్లు మార్చడం కూడా మంచిది కాదు. గేర్ మార్చినప్పుడు ఖచ్చితంగా క్లచ్ పూర్తిగా మూసిన తర్వాతే మార్చాలి.
Also Read:తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా?