ఈ రోజుల్లో గడ్డ పెరుగు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడో తప్పించి గడ్డ పెరుగు అనేది కనపడటం లేదు. ప్యాకెట్ పాలతో చేసిన పెరుగునే తింటున్నాం. గడ్డ పెరుగు రుచి గాని గడ్డ పెరుగు తో చేసిన మజ్జిగ గాని, వెన్న, నెయ్యి ఎంతో రుచిగా ఉంటాయనే మాట వాస్తవం. ఇక పెరుగుని తోడింటి వేసే విషయంలో చాలా మందికి టెక్నిక్ తెలియదు.
Also Read:మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులో సూపర్ సేవర్ కార్డ్
మనకు గడ్డ పెరుగు తీయడం తెలియక రావడం లేదు అనుకుంటాం. ఒక అర లీటర్ పాలు ఒక పాత్రలో వేసి మరిగించాలి ముందు. పాలు పొంగు వచ్చిన తర్వాత కూడా కాసేపు మరగాల్సి ఉంటుంది. పాలల్లో ఉండే నీరు మొత్తం ఆవిరి రూపంలో బయటకు పోతుంది. ఆ తర్వాత పాలు స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టి కొంచెం సేపు వదిలేయండి. గోరు వెచ్చగా మారే వరకు వదిలేయండి.
గోరు వెచ్చగా అయిన తర్వాత ఒక పచ్చి మిరపకాయ వేసి, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా తిప్పండి. మూత పెట్టి నాలుగు గంటలు ఉంచిన తర్వాత కమ్మని పెరుగు తయారు అయినట్టే. పెరుగు తయారు అయిన తర్వాత పెరుగు పాత్రను ఒక గంట ఫ్రిడ్జ్ లో ఉంచి తీస్తే పెరుగు గట్టిగా ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. చిక్కటి పాలు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి.
Advertisements
Also Read:సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి…? ఆ ప్రక్రియ ఎలా జరిగింది…?