ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది తీవ్రమైన సమస్యగా చెప్పాలి. గతంలో ఎక్కడో అరుదుగా కనపడే ఈ వ్యాధి ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లో ఒకరిని పలకరిస్తుంది. అది వస్తే జీవితం మొత్తం నరకం అనే భయం వెంటాడుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ లు చేసుకుంటూ కాలం గడపాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే… భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం.
Also Read:గాంధీభవన్ ముట్టడి.. ఉద్రిక్తత!
మాములుగా షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు వ్యాయామం ఎక్కువగా చేయాలని చెప్తారు. వాళ్ళు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతీ రోజు సైకిల్ తొక్కడం లేదంటే… రోజూ ఒక 45 నిమిషాలు వేగంగా నడవం లేదంటే ఏదోక వ్యాయామం అలవాటు చేసుకోండి. అలాగే పంచదార బదులుగా బెల్లం వాడటం ఉత్తమం. ఇక ఆలోచనల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలు ఆలోచించి ఆందోళన చెందకూడదు.
తినే తిండి ఒకసారి తినకుండా రెండు మూడు సార్లుగా తినడం మంచిది. చేసే వ్యాయామం మనం జీవితాంతం కంటిన్యూ చేస్తామా లేదా ఆలోచించుకుని చేయాలి. ఇక రాత్రి తొందరగా డిన్నర్ పూర్తి చేయండి. రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్ళు తాగాల్సి ఉంటుంది. పగలు ఎక్కువ సేపు పడుకోవడం మంచిది కాదు. కనీసం 8 గంటల నిద్ర అవసరం. మలబద్దకం సమస్యకు దూరంగా ఉండటం మంచిది. ప్రకృతి కి దగ్గరగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మొత్తం ఆహరం లో కార్బస్ 20% మించకుండా తినాల్సి ఉంటుంది. ఆకు కూరలు వంటి వాటిని ఎక్కువగా తినడం మంచిది.
Also Read:నోరు జారాను.. అది నా తప్పిదమే…!