రోజు రోజుకి హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. మన దేశంలో యువత ప్రధానంగా దీని బారిన పడుతున్నారు. ఆరోగ్యంపై కనీస అవగాహన లేక అనవసరంగా దీర్ఘకాలిక సమస్యలు తెచ్చుకుంటున్నారు. అసలు దీని సంకేతాలు ఏంటీ…? దీని నుంచి బయట పడాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు మనకు కనపడతాయి.
Also Read:రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఇక గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, తగినంత సాధారణ శారీరక శ్రమ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీని నుంచి బయట పడటానికి ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం, 20-40 ఏళ్ల మధ్య ఉన్న చాలా మంది దీని బారిన పడుతున్నారు.
ప్రతిరోజూ తవ్పని సరిగ్గా 30నుంచి 45 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. కుర్చీ కే పరిమితం కాకుండా ప్రతీ అరగంటకు ఒకసారి నడవడం మంచిది. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్తలు తీసుకోవాలి. ఆరటి బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి ఫలాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. తినే ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవడం ఉత్తమం. అదే విధంగా రెడ్ మీట్ , మీగడ, వెన్న, నూనే వంటి వాటికీ దూరంగా లేకపోతే సమస్యలు వస్తాయి. ధూమపానం, మద్యపానానికి శాస్వతంగా దూరంగా ఉండాలి.
బయట ఆహార పదార్ధాల జోలికి… ప్రధానంగా ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళడం మంచిది కాదు. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ… వ్యాయామం చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడటం మంచిది కాదు. ఇక ఉదయం సాయంత్రం సమయాల్లో మ్యూజిక్ వినాలి. టెన్షన్ వచ్చే టైం లో నచ్చిన వారితో మాట్లాడాలి..
హైపర్‌టెన్షన్ ఉన్నవారు చేయాల్సినవి చూస్తే… జీవితాంతం మందులు వేసుకోవడం తప్పదు. డాక్టర్ ను కలవడం, ఆరోగ్యం గురించి తెలుసుకోవడం వంటివి చేయాలి. మందుల వాడకాన్ని ఒక్క రోజు ఆపేసినా సరే సమస్యలు వస్తాయి. ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకం మార్చుకోవాల్సి ఉంటుంది. షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు నిత్యం చేయించుకోవాలి. కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి.
Also Read:రష్యాపై పలు దేశాలు ఆంక్షలు..!