లడఖ్ వెళ్ళడం అనేది చాలా మందికి డ్రీం. మనాలి నుంచి లడఖ్ బైక్ రైడ్ అనేది చాలా మంది కోరిక. అలాగే శ్రీనగర్ టూ లడఖ్ ట్రిప్ కూడా చాలా మంది ఎదురు చూసే ట్రిప్. అయితే మనం ఎప్పుడు వెళ్ళాలి ఏంటీ అనేది పక్కాగా తెలుసుకుని వెళ్ళాలి. అలాగే లడఖ్ వెళ్తే ఎదురయ్యే పరిస్థితి గురించి కూడా అవగాహన ఉండాల్సి ఉంటుంది. లడఖ్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా…?
అక్కడ మీరు ఎన్ని రోజులు ఉండాలని ప్లాన్ చేసుకున్నారు అనేది మీరు వెళ్ళే టీం తో మాట్లాడుకోండి. ఇక ఏ నెలలో వెళ్ళాలో నిర్ణయం తీసుకోవాలి. ఏ మార్గంలో వెళ్ళాలి అనేది కూడా చాలా కీలకం. మనాలి నుంచి లేదా శ్రీనగర్ నుంచి వెళ్ళాలి అంటే మే నుంచి అక్టోబర్ చివరి వరకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత రహదారులను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
వాతావరణం పై చాలా అవగాహన ఉండాలి. లడఖ్ లో కొన్ని కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్తే ఊపిరి ఆడదు. ఉదాహరణకు ప్యాంగాంగ్ లేక్ వెళ్తే రాత్రి సమయంలో ఆక్సీజన్ అంధక చాలా ఇబ్బంది పడతారు. ఇక లడఖ్ లో లిక్కర్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జియో పోస్ట్ పెయిడ్ మాత్రమే పని చేస్తుంది. బీఎస్ఎన్ ఎల్ కూడా పని చేస్తుంది.
మనాలి నుంచి లడఖ్ వచ్చే దారిలో దాదాపు 350 కిలోమీటర్లు ఫోన్ సిగ్నల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎత్తైన హిమాలయాల మీదుగా మంచు లాంటి ప్రాంతాల్లో దుర్భరమైన రోడ్లలో రావాల్సి ఉంటుంది. ఇక అక్కడి సరిహద్దుల పరిస్థితి, ఆర్మీ ఎక్కడి వరకు అనుమతులు ఇస్తుంది వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.