పైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఆ సమస్య జీవితం మీద విరక్తి పెంచుతుంది. ఈ మధ్య కాలంలో పైల్స్ సమస్యతో బాధ పడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే దీన్ని మొదటి దశలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్దకం లేకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక మాంసాహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Also Read:కరోనాతో షాకింగ్ సమస్య…? మీకు జుట్టు రాలుతుందా…?
ఆల్కహాల్ కు సైతం దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాల్సి ఉంటుంది. పండ్లు – పీచు (ఫైబర్ ) ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. పలుచని మజ్జిగ, ఎక్కువగా మంచి నీరు తాగడం చేయాలి. మంచి నిద్ర కూడా చాలా అవసరం. మలవిసర్జన విషయంలో బలవంతంగా చేయకూడదు. బంగాళాదుంప పదార్దాలు, సపోటా పండు తింటే సమస్య ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కచ్చితంగా పాటిస్తే గనుక మలద్వార వాపు , తీపు , మల విసర్జన సమయంలో నొప్పి, రక్తం రావడం తగ్గుతాయి. మందులు -సర్జరీ అవసరం లేకుండా కూడా వాటిని తగ్గించుకోవచ్చు. హోమియో మందులు కూడా బాగా పని చేస్తాయి. అయితే పైల్స్ ని ముందు గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి దశలో ఉందా లేదా అనేది ఆ విషయంలో నిపుణులైన వైద్యులే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉన్న ఎంబీబిఎస్ చదివిన డాక్టర్ తో సంప్రదించి ఆయన గారి సలహా మేరకు నడచుకోండి.
Also Read:కోహ్లికి… బాలీవుడ్ కి పెద్ద తేడా లేదు!!