ఈ రోజుల్లో కమ్మటి పెరుగు దొరకడం కాస్త కష్టంగానే ఉంది. ఇంట్లో తయారు చేసుకునే పెరుగు కూడా పెద్దగా రుచిగా ఉండటం లేదు. పాలు కల్తీగా దొరకడమే దీనికి కారణం. ఇక మంచి పాలు దొరికినా సరే పెరుగు విషయంలో సరైన అవగాహన లేకపోవడం మరో సమస్య. ఇక కమ్మటి పెరుగు, గట్టి పెరుగు ఎలా రావాలి…? ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచి పెరుగు తినవచ్చో చూద్దాం.
Also Read:విపక్ష అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు…!
వాస్తవానికి పెరుగు గట్టిదనం, కమ్మదనం అనేవి మనం ఎంచుకున్న తోడు మీద ఉంటాయి. కమర్షియల్ గా బయట అమ్మే బ్రాండ్ల పెరుగులో గట్టిగా ఉండడానికీ, పెరుగు, నీళ్ళు విడిపోకుండా ఉండడానికి గాను… గోరు చిక్కుడు కాయలతో చేసిన గమ్ కలుపుతారు. కొన్నిసార్లు శాకాహారం కాని జిలాటిన్ కూడా కలుపుతూ ఉంటారు. ఇక రుచి కోసం గాను పెక్టిన్ కూడా కలుపుతారు. మరికొందరు వెనిలా, స్ట్రాబెర్రీ లాంటి పళ్ళు, చక్కెర వంటివి కూడా యాడ్ చేయడం జరుగుతుంది.
తోడు వేసే ముందు… పాలు బాగా మరింగించాల్సి ఉంటుంది. చాలా మంది ఒకసారి రెండు సార్లు మాత్రమే మరిగిస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక తోడు వేసే పెరుగు కూడా మంచిది అయి ఉండాలి. ఇక ఒక అట్టపెట్టెలో పాలగిన్నెను మెత్తటి తువ్వాలు చుట్టి మూత మూసి, ఇంట్లో ఒక మూల ఉంచాల్సి ఉంటుంది. ఫ్రిజ్ పైన సాధారణంగా కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టినా మంచి ఫలితం వస్తుంది. కొందరు థెర్మకోల్‌తో చేసిన డబ్బాలలో కూడా పెడతారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు గిన్నెను కొద్దిగా వేడిచేసి అందులో పాలగిన్నె పెట్టినా గట్టి పెరుగు వస్తుంది.
Also Read:సీఎం కేసీఆర్ ను చెట్టుకు కట్టేసి.. మూసీ నీళ్లతో స్నానం చేయించండి: బండి సంజయ్