వర్షా కాలం వచ్చింది అంటే చాలు జ్వరాల భయం ఎక్కువగా ఉంటుంది. జ్వరం దెబ్బకు భయపడి చాలా మంది ఇళ్ళల్లో నుంచి బయటకు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ఇక జ్వరం సమయంలో వచ్చే కొన్ని సమస్యలు కొన్ని రోజుల పాటు కొనసాగుతాయి. అలాంటి వాటిల్లో నోరు చేదుగా ఉండే సమస్య ఒకటి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం కొన్ని పద్దతులు పాటిస్తే చాలు.
Also Read:భోజనం చేయకపోతే తల నొప్పి ఎందుకు వస్తుంది…?
జ్వరానికి కారకం బట్టి చేదు ఉంటుంది. మామూలు జ్వరమైతే అంటే… ఏదైనా బరువులు ఎత్తడం లేదంటే కాస్త ఎక్కువగా కష్టపడటంతో వచ్చే జ్వరం అయితే గనుక ఎక్కువగా చేదు ఉండదు. కాని మందుల కారణంగా వచ్చే చేదు అయితే మాత్రం ఆ మందుల ప్రభావం తగ్గే వరకు ఉంటుంది. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగడం మంచిది. ఇక ఏ మందులు వేసుకున్నా సొంత వైద్యం కాకుండా వైద్యులను అడిగి వేసుకోవడం మంచిది.
ఇక నోరు చేదు పోవాలి అంటే అల్బాకరా కాయలు బుగ్గన పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుల్ల పుల్లగా తియ్యగా నోటికి చాలా బాగుంటది కొంచం చేదు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అల్లము4 చిన్న ముక్కలు , వెల్లుల్లి ఒక రెబ్బ మరియు తేనె కలుపుకొని ఉదయమే తింటే చేదు పోయే అవకాశం ఉంటుంది. ఇలా రోజుకి రెండు సార్లు చేయాలి.
Also Read:విపక్ష అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు…!