ఉదయ్ కిరణ్ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు తెరపై అద్భుతంగా రాణించి కనుమరుగైన హీరో. వి.ఎన్. ఆదిత్య తనదైన దర్శకత్వ ప్రతిభతో మంచి కథాంశాలు తెలుగుతెరకు కానుకిచ్చిన దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. మొదటి చిత్రం ‘మనసంతానువ్వే’ అప్పట్లో కుర్రకారుని విశేషంగా ఆకట్టుకున్న చిత్రమిది.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎం.ఎస్.రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీంతోఇండస్ట్రీలో వి.ఎన్.ఆదిత్య పేర మార్మోగిపోయింది.
మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.
ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగ్ లు ఉండటం వల్ల ఆ ఒత్తిడితో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ తప్పేమీ లేదని అన్నారు. అసలు పద్ధతి ప్లాన్ లేదా ఒక రాక్షసుడిలా పని చేస్తున్నాను. ఇండస్ట్రీలో అందరూ సీనియర్ హీరోలే కానీ ఎవరికీ బుర్ర లేదా అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ గట్టిగా అరిచారని చెప్పారు. దీంతో ఉదయ్ కిరణ్ కు ఎన్ని టెన్షన్ లు ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ పై అరవడం తనకు నచ్చలేదని చెప్పారు.
షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పి మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయా అని చెప్పారు. దీంతో తన కెమెరామెన్ ఇతర సిబ్బంది కార్ వేసుకుని వచ్చారని అన్నారు. ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, చనిపోయే వారం ముందు కూడా తనకు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడాడని విఎన్ ఆదిత్య ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: కాంతారా సినిమాలో తల్లిపాత్ర వేసిన నటి నేపథ్యం తెలుసా..!?