ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే… ఇది ఒకే హాట్ స్పాట్ కేంద్రంగా ఉండటంతో కట్టడి మరీ ఇబ్బంది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ… మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిని దాదాపు అదుపులోకి తీసుకున్నాయి.
అయితే… మొదట జనతా కర్ఫ్యూ రోజున వైద్య సిబ్బంది, పారిశుద్య సిబ్బందికి అండగాఉన్నామని చెప్పేందుకు ప్రజలంతా తమ ఇంటి వద్ద శబ్ధం చేయాలని కోరారు. ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా 9 నిమిషాల పాటు లైట్స్ ఆర్పేసి… దీపాలు వెలిగించాలని కోరారు. ఆ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. అయితే… ఇది బిగ్ బాస్ కార్యక్రమంలో బిగ్ బాస్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి టాస్క్ ఇచ్చినట్లు ఉంది అన్న సెటైర్స్ గట్టిగా వినిపించాయి.
మరోవైపు… కేంద్ర కేబినెట్ సమావేశం సోమవారం మద్యాహ్నం జరగబోతుంది. కరోనా అంశం, లాక్ డౌన్ ఎత్తివేత, దేశంలో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలు, ప్రజల ఇబ్బందుల అంశాలపైనే ప్రధానంగా చర్చ సాగుతుంది.
ఇక ఈ మీటింగ్ తర్వాత కానీ ఒకట్రెండు రోజుల్లో కానీ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో జనం అంతా బిగ్ బాస్ ఇప్పుడు ఎలాంటి టాస్క్ ఇవ్వబోతున్నారు….? అన్న చర్చ జోరందుకుంది.