అసోంలో బాల్య వివాహాలు చేసుకున్న వారిని ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2257 మంది భర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై రాష్ట వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసోం ప్రభుత్వంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కానీ దిగువ అసోం ప్రజల విషయంలో మాత్రం వివక్ష పాటించిందన్నారు. అసోంను బీజేపీ గత ఆరేండ్లుగా పరిపాలిస్తోందని, ఇప్పటి వరకు బాల్య వివాహాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమన్నారు.
ఇప్పుడు వారిని జైళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. వారి భార్యల సంరక్షణ ఎవరు చూసుకుంటారు. సీఎం హిమంత బిశ్వ శర్మ ఏమైనా వారి సంరక్షణ చూసుకుంటారా అన్నారు. ప్రజలను తీవ్రమైన బాధల్లోకి ప్రభుత్వం నెడుతోందన్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలను ప్రభుత్వం స్థాపించిందని అడిగారు. రాష్ట్రంలో నూతన పాఠశాలలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు.