భూమిపై ఎన్నో అద్భుతాలు. మరెన్నో రహస్యాలు.. వాటి గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. యెమెన్ లో ఉన్న వెల్ ఆఫ్ హెల్ కూడా అంతే. ఈ భారీ గొయ్యిలోకి వెళ్లిన వారికి చావు తప్పదనే నమ్మకం స్థానికంగా బలంగా నమ్ముతారు. అయితే భూగర్భ శాస్త్రవేత్త మహ్మద్ అల్ కిండీ నేతృత్వంలోని ఓ టీమ్ అందులోకి వెళ్లింది. అసలు.. ఈ గొయ్యిలో ఏముందో అందరికీ తెలిసేలా చేసింది.
భూమికి 367 అడుగుల లోతులో ఉన్న ఈ గొయ్యిలోని రహస్యాలు తెలుసుకుంది మహ్మద్ కిండీ టీమ్. తాళ్ల సాయంతో లోపలికి వెళ్లాక.. వారికి అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఓ పెద్ద పాముల పుట్ట ఉందట. దానికి దగ్గరలో పైనుంచి జలపాతంలా నీళ్లు కారుతూ ఉన్నాయి. అక్కడే ఆకుపచ్చ రంగులో ముత్యాల్లా రాళ్లు మెరుస్తున్నాయి. చూడడానికి ఆ ప్రదేశం ఎంతో కలర్ ఫుల్ గా ఉందని చెప్పారు మహ్మద్ అల్ కిండీ.
గొయ్యి లోపలికి దిగే సమయం నుంచి లోపలికి వెళ్లే వరకు మొత్తం వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.